iDreamPost

మరో OTTలోకి వైష్ణవి చైతన్య హారర్ థ్రిల్లర్ మూవీ..ఎప్పుడంటే?

  • Published Jun 17, 2024 | 11:19 AMUpdated Jun 17, 2024 | 11:19 AM

ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య నటించిన లవ్ మి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, మూవీ గత నెల మే 25న థియేటర్లలో రిలీజైంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో.. రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ఇప్పుడు మరో ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య నటించిన లవ్ మి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, మూవీ గత నెల మే 25న థియేటర్లలో రిలీజైంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో.. రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ఇప్పుడు మరో ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

  • Published Jun 17, 2024 | 11:19 AMUpdated Jun 17, 2024 | 11:19 AM
మరో OTTలోకి వైష్ణవి చైతన్య హారర్ థ్రిల్లర్ మూవీ..ఎప్పుడంటే?

బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య, ఆశిష్ రెడ్డి లేటెస్ట్ గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘లమ్ మి ఇఫ్ యు డేర్’. కాగా, ఈ మూవీ గత నెల 25న థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ మూవీని డైరెక్టర్ అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. అయితే హారర్ థ్రిల్లర్ జానర్ లో సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మొదటి రోజు మాత్రం ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా తొలిరేజే ఈ సినిమాకు రూ.4.5 కోట్లు వసూళ్లు చేసిందని మూవీ టీమ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆ తర్వాత కాలంలో ఈ మూవీ అంతగా కలెక్షన్స్ రాబట్టుకోలేక పోయింది. దీంతో ఈ సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. కాగా,గత శుక్రవారం అనగా జూన్ 14వ తేది నుంచి సడెన్ గా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ఓటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇంతకి ఎక్కడంటే..

ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య నటించిన లవ్ మి ఇఫ్ యు డేర్ మూవీతో  ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, మూవీ గత నెల మే 25న థియేటర్లలో రిలీజైంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో.. రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే.. ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా ఎలాంటి సమాచారం లేకుండా.. సడెన్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. కానీ ఇప్పుడు మరో ఓటీటీలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవతుంది. కాగా,  లమ్ మి ఇఫ్ యు డేర్ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్  ఆహాలో స్ట్రీమింగ్ కు  వచ్చేసింది. అయితే ఈ మూవీ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చినట్లు ఆ ప్లాట్‌ఫామ్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ఇకపోతే ఈ సినిమాను దర్శకుడు అరుణ్ భీమవరపు దెయ్యంతో ప్రేమ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, ఈ సినిమా అడియాన్స్ ను అంతగా ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇక లవ్ మి చిత్రానికి లవ్ మీ చిత్రాన్ని దిల్‍రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు. అలాగే ఈ  సినిమాకు  ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్ గా కిల్ మీ.. ఇఫ్ యూ లవ్’ వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక లవ్ మి ఇఫ్ యు డేర్  విషయానికొస్తే.. అర్జున్ (ఆశిష్), ప్రియ (వైష్ణవి చైతన్య) ప్రేమలో ఉంటారు. అయితే అర్జున్ మాత్రం తన యూట్యూబ్ ఛానెల్‍లో దెయ్యాలు లేవంటూ వీడియోలు చేస్తుంటాడు. అలాగే మిస్టరీలను ఛేదించడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఈ క్రమంలోనే దివ్యావతి అనే దెయ్యం గురించి అర్జున్‍కు ప్రియ చెబుతుంది. ఇక దివ్యావతి కథ విన్నాక ఆ దెయ్యాన్ని ప్రేమించాలని అర్జున్ నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆ దెయ్యం ఉన్న పాడుబడ్డ భవనానికి వెళతాడు. ఆ తర్వాత అర్జున్‍కు ఎదురైన పరిస్థితులు ఏంటి.. దివ్యావతి వెనకున్న కథేంటి.. అర్జున్‍కు దివ్యావతి గురించి ప్రియ ఎందుకు చెప్పింది అనేదే లవ్ మీ మూవీ కథ. మరి ఈ కథ గురించి తెలియాలంటే వెంటనే ఓటీటీలో ఈ మూవీ చూసేయాల్సిందే. మరి, లవ్ మి మూవీ మరో ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి