iDreamPost
android-app
ios-app

పిల్లలతో కోహ్లీ యాడ్‌! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

  • Published Sep 21, 2023 | 12:58 PM Updated Updated Sep 21, 2023 | 12:58 PM
  • Published Sep 21, 2023 | 12:58 PMUpdated Sep 21, 2023 | 12:58 PM
పిల్లలతో కోహ్లీ యాడ్‌! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఏం చేసినా సెన్సెషనే. అతనికి ఉన్న ఫాలోయింగ్‌, క్రేజ్‌ దృష్ట్యా.. విరాట్‌ చేసే ప్రతి చిన్న పని కూడా వార్తల్లో హెడ్‌లైన్‌ అవుతుంది. ఇప్పుడు కోహ్లీ రేంజ్‌.. వార్తలను దాటేసి.. కోర్టులకు వరకు వెళ్లింది. తాజాగా కోహ్లీ చేసిన ఓ యాడ్‌ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు వెళ్లాయి. పిల్లలను ఆటల్లో ప్రొత్సాహించలనే సదుద్దేశంతో ఓ యాడ్‌ను రూపొందించారు. అందులో కొంతమంది పిల్లలతో కలిసి కోహ్లీ నటించాడు.

ఆ యాడ్‌ సారాంశం ఏంటంటే.. పిల్లలను ఆటలకు దూరంగా ఉండకూడదు, వారిని స్పోర్ట్స్‌ వైపు అడుగులేసేలా ఎంకరేజ్‌ చేయాలి అని. అయితే.. ఈ యాడ్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు సుమోటగా స్వీకరించి.. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిల్లలను క్రీడారంగాల్లో ప్రొత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కొత్తగా ఎన్ని క్రీడా మైదానాలు నిర్మించారు? ‘ఖేలో ఇండియా’ లక్ష్యం ఎంత వరకు నెరవేరింది? అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది.

కోహ్లీ చేసిన ఒక్క యాడ్‌తో ఏకంగా హైకోర్టు స్పందించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిజానికి ప్రస్తుతం చాలా నగరాల్లో పిల్లలు ఆడుకునేందుకు మైదానాలు కరువైపోయాయి. దీంతో పిల్లలు ఎక్కువగా ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోతూ.. శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. దీంతో పిల్లలో ఊబకాయం ఇతరేతర సమస్యలు కూడా వస్తున్నాయి. అలాగే చాలా మంది పిల్లలు అసలు అవుట్‌ డోర్‌గేమ్స్‌కు పూర్తి దూరం అవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై విచారణ జరపండి! పోలీసులకు ఫిర్యాదు