iDreamPost

ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై విచారణ జరపండి! పోలీసులకు ఫిర్యాదు

  • Published Sep 21, 2023 | 11:03 AMUpdated Sep 21, 2023 | 11:03 AM
  • Published Sep 21, 2023 | 11:03 AMUpdated Sep 21, 2023 | 11:03 AM
ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై విచారణ జరపండి! పోలీసులకు ఫిర్యాదు

ఇటీవల టీమిండియా ఆసియా కప్‌ గెలిచిన విషయం తెలిసిందే. కొలంబోలో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు.. 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ డసన్‌ షనక తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయించాడు. బౌలింగ్‌కు దిగిన భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. తొలుత బుమ్రా తన రెండో ఓవర్‌లో తొలి వికెట్‌ తీశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ వేసేందుకు వచ్చిన మొహమ్మద్‌ సిరాజ్‌.. ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగడంతో.. లంక కేవలం 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా వారి ఇన్నింగ్స్‌ ఎక్కువ సేపు కొనసాగలేదు.

అప్పటికే 4 వికెట్లు తీసి సంచలన బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన సిరాజ్‌ మరో రెండు వికెట్లు పడగొట్టాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సైతం మూడు వికెట్లతో రాణించడంతో శ్రీలంక కేవలం 50 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసియా కప్‌ ఫైనల్‌ వరకు అద్భుత పోరాటంతో వచ్చిన లంకేయులు.. ఫైనల్లో మాత్రం ఇండియా బౌలింగ్‌కు దాసోహం అయ్యారు. ఇక 51 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌-ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ పడకుండా కొట్టేశారు. టార్గెట్‌ తక్కువగా ఉండటంతో ఓపెనర్‌గా రావాల్సిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తన స్థానంలో ఇషాన్‌ను ఓపెనర్‌గా పంపించాడు. మొత్తానికి ఆసియా కప్‌ ఫైనల్‌లో సంచలన ప్రదర్శనతో టీమిండియా అద్భుత విజయం సాధించింది.

అయితే.. ఈ ఫైనల్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది యాంటీ ఇండియన్‌ ఫ్యాన్స్‌ ఆసియా కప్‌ ఫైనల్‌ ఫిక్స్‌ అయిందంటూ సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. వాటిని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, తాజాగా శ్రీలంకలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై విచారణ జరిపించాలని ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం. శ్రీలంక-భారత్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌పై విచారణ జరపాలని, తమకు ఫిక్సింగ్‌ జరిగిందనే అనమానాలు ఉన్నట్లు కొలంబోలని స్థానిక పౌరహక్కుల సంస్థ ‘సిటిజెన్‌ పవర్‌ అగెనెస్ట్‌ బ్రైబరీ, కరప్షన్‌ అండ్‌ వేస్టెజ్‌’ కొలంబో పోలీస్‌ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫైనల్‌ మ్యాచ్‌పై వెంటనే విచారణ చేయాలంటూ సదరు సంస్థ చైర్మన్‌ సమంతా తుషార డిమాండ్‌ చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాకిస్థాన్ పరువు తీసిన హర్భజన్ సింగ్! వరల్డ్ కప్ లో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి