iDreamPost

పాక్​ను ఇంటికి పంపిన USAకు జాక్​పాట్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే!

  • Published Jun 15, 2024 | 11:41 AMUpdated Jun 15, 2024 | 11:41 AM

ఆఖరి మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్​ను ఇంటికి పంపింది పసికూన యూఎస్​ఏ. తమ అభిమాన జట్టు గ్రూప్ స్టేజ్​లోనే నిష్క్రమించడంతో దాయాది ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇదంతా స్వయంకృతాపరాధమే అంటూ ఆటగాళ్లను నిందిస్తున్నారు.

ఆఖరి మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్​ను ఇంటికి పంపింది పసికూన యూఎస్​ఏ. తమ అభిమాన జట్టు గ్రూప్ స్టేజ్​లోనే నిష్క్రమించడంతో దాయాది ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇదంతా స్వయంకృతాపరాధమే అంటూ ఆటగాళ్లను నిందిస్తున్నారు.

  • Published Jun 15, 2024 | 11:41 AMUpdated Jun 15, 2024 | 11:41 AM
పాక్​ను ఇంటికి పంపిన USAకు జాక్​పాట్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే!

టీ20 వరల్డ్ కప్​-2024లో ఎవ్వరూ ఊహించనివి జరుగుతున్నాయి. పసికూన జట్లు అద్భుత విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంటే.. టాప్ టీమ్స్ మాత్రం దారుణ పరాజయాలతో ఇంటిదారి పడుతున్నాయి. స్లో, ట్రిక్కీ పిచ్​లపై ఎలా ఆడాలో తెలియక మహామహా జట్లు కూడా మట్టికరవడం చూస్తున్నాం. ఇప్పటికే ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్​తో పాటు క్రికెట్​లో ఎంతో ఘన చరిత్ర కలిగిన శ్రీలంక ఇంటిదారి పట్టగా.. ఇప్పుడు దాయాది పాకిస్థాన్ కూడా అదే కోవలో చేరింది. పొట్టి కప్పు నుంచి పాక్ నిష్క్రమించింది. పసికూన అమెరికా సూపర్-8కు క్వాలిఫై అయింది. గ్రూప్​-ఏలో భాగంగా ఫ్లోరిడా వేదికగా యూఎస్​ఏకు, ఐర్లాండ్​కు మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు టీమ్స్​కు ఒక్కో పాయింట్ ఇచ్చారు. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఐదు పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధించింది ఆతిథ్య అమెరికా.

మూడు మ్యాచుల్లో ఒక విక్టరీ మాత్రమే కొట్టిన పాకిస్థాన్ రెండు పాయింట్లతో ఉంది. ఈ నెల 16న ఐర్లాండ్​తో ఆ టీమ్ మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ అందులో నెగ్గినా దాయాది ఖాతాలో నాలుగు పాయింట్లే ఉంటాయి. దీంతో ఐర్లాండ్​తో మ్యాచ్​ ఆ జట్టుకు నామమాత్రంగా మారనుంది. యూఎస్​ఏ తమ ఆఖరి మ్యాచ్ ఆడకుండానే పాక్​ను ఇంటికి పంపింది. ఐర్లాండ్​తో మ్యాచ్ రద్దవడంతో ఆ టీమ్ డబుల్ జాక్​పాట్ కొట్టింది. టీ20 ప్రపంచ కప్​లో సూపర్​-8 స్టేజ్​కు క్వాలిఫై అయిన ఏడో అసోసియేట్ టీమ్​గా అగ్రరాజ్యం చరిత్ర సృష్టించింది. ఇంతకముందు వరల్డ్ కప్-2009లో ఐర్లాండ్, నెదర్లాండ్స్ (2014), ఆఫ్ఘానిస్థాన్ (2016), నమీబియా (2021), స్కాట్లాండ్ (2021), నెదర్లాండ్స్ (2022) సూపర్​-8 స్టేజ్​కు అర్హత సాధించాయి. ఇప్పుడు వాటి సరసన యూఎస్​ఏ చేరింది.

USA

ప్రపంచ కప్-2024​లో సూపర్​-8కు చేరిన అమెరికా.. మరో ఘనత కూడా సాధించింది. వచ్చే టీ20 వరల్డ్ కప్-2026కు ఆ జట్టు క్వాలిఫై అయింది. ప్రస్తుత పొట్టి కప్పులో సూపర్-8కు చేరిన టీమ్స్ వచ్చే ప్రపంచ కప్​కు నేరుగా అర్హత సాధిస్తాయి. నెక్స్ట్ వరల్డ్ కప్​కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంతో సూపర్-8 దశతో సంబంధం లేకుండా ఆతిథ్య దేశాలుగా ఈ రెండూ క్వాలిఫై అవుతాయి. ప్రస్తుత ప్రపంచ కప్​లో టీమిండియా ఇప్పటికే సూపర్ పోరుకు అర్హత సాధించింది. కానీ లంక మాత్రం గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టు వచ్చే పొట్టి కప్పు కోసం క్వాలిఫికేషన్ మ్యాచులు ఆడాల్సి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ హోస్టింగ్ నేషన్ కాబట్టి ఆ టీమ్ నేరుగా మెగా టోర్నీలో బరిలో దిగనుంది. మరి.. అమెరికా సూపర్-8కు చేరుకోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి