iDreamPost
android-app
ios-app

Uppena : పాన్ వరల్డ్ స్థాయిలో సంచలన ప్రేమకథ ?

  • Published Oct 21, 2021 | 6:58 AM Updated Updated Oct 21, 2021 | 6:58 AM
Uppena : పాన్ వరల్డ్ స్థాయిలో సంచలన ప్రేమకథ ?

ఈ ఏడాది ప్రారంభంలో లాక్ డౌన్ తీసేశాక వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ గా ఉప్పెన రేపిన సంచలనం ఏ స్థాయిలో వసూళ్లు తెచ్చిందో ఇంకా ఎవరూ మర్చిపోలేదు. మొదటి రోజే పది కోట్ల కలెక్షన్ కళ్లజూసిన డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ కు మంచి రికార్డు దక్కింది. దాని ప్రయోజనం కొండపొలంకు కలగలేదు అది వేరే విషయం. అంత గొప్ప విజయం సాధించాక కూడా దర్శకుడు బుచ్చిబాబు తర్వాతి సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపించాడనే టాక్ వచ్చింది కానీ ఫైనల్ గా యంగ్ టైగర్ కొరటాల శివతో లాక్ అయ్యాడు. ఏడాది దాకా తారక్ అందుబాటులో లేనట్టే. మరి బుచ్చిబాబు ఏం ప్లాన్ లో ఉన్నాడనే డౌట్ రావడం సహజం.

తాజా అప్ డేట్ ప్రకారం ఇతను ఉప్పెన 2 తీసే దిశగా ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారట. అది కూడా ఆషామాషీ బడ్జెట్ లో కాదు. పాన్ ఇండియాని మించి పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తారట. మరి హీరోగా వైష్ణవ్ తేజ్ ఉంటాడా లేక వేరే కాంబినేషన్ ట్రై చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయినా ప్రేమకథను పాన్ వరల్డ్ లో తీయడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రభాస్ రేంజ్ హీరో అయితే రాధే శ్యామ్ టైపు లో వర్క్ అవుట్ చేసుకోవచ్చు కానీ కొత్త జంటలతో అంత ఖర్చు పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడులు సేఫ్ కావడం అంత సులభం కాదు. మరి నిజంగా ఉప్పెన 2 తీస్తారా అనేది ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి.

అసలే టాలీవుడ్ లో సీక్వెల్స్ కు సంబంధించి నెగటివ్ సెంటిమెంట్ ఉంది. బాహుబలి మినహాయించి ఏ కమర్షియల్ సినిమా కొనసాగింపు ఆడిన దాఖలాలు లేవు. కిక్ 2, మన్మథుడు 2, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఎన్నో డిజాస్టర్లు ఉదాహరణగా కనిపిస్తాయి. ఇలాంటి కంటిన్యూయేషన్లు బాలీవుడ్ హాలీవుడ్ లో మంచి ఫలితాలు ఇచ్చాయి కానీ సౌత్ లో కాదు. ఉప్పెనలో దర్శకుడిగా బుచ్చిబాబు చెప్పాలనుకున్నది చెప్పేశాడు. మరి ఉప్పెన 2 కార్యరూపం దాలిస్తే ఏం చూపిస్తాడో. విజయ్ సేతుపతి లేకుండా అయితే ఊహించుకోవడం కష్టం. ఎలాగూ ఆ పాత్రను చంపలేదు కాబట్టి కొనసాగించొచ్చు

Also Read : Mohan Babu : కలెక్షన్ కింగ్ చిన్నితెర దర్శనం ఇస్తారా

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbet