iDreamPost
android-app
ios-app

Unstoppable : బాలయ్య షో ప్రభావం గట్టిగానే ఉంది

  • Published Jan 09, 2022 | 8:57 AM Updated Updated Jan 09, 2022 | 8:57 AM
Unstoppable : బాలయ్య షో ప్రభావం గట్టిగానే ఉంది

ఊహించని రేంజ్ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఆహా యాప్ లో దూసుకుపోతోంది. ఈ రెస్పాన్స్ నిజానికి ఊహించనిది. ఐఎండిబిలో సైతం దీనికి 9కి పైగా రేటింగ్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి ఇలాంటి టాక్ షోలు శాటిలైట్ ఛానల్స్ లోనే ఎక్కువగా వర్కౌట్ అవుతాయి. కానీ ఓటిటిలో ఈ రేంజ్ సక్సెస్ కావడం మాత్రం ముమ్మాటికీ బాలయ్య క్రెడిటే. సెలబ్రిటీలు అందరూ ఒకే స్థాయి వారు కాకపోయినా, తన మ్యానరిజంతో, సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటున్న తీరు చందాదారులను పెంచిన మాట వాస్తవం. మంచు ఫ్యామిలీతో మొదలుపెట్టి నిన్నటి రానా ఎపిసోడ్ దాకా దాదాపు అన్నీ భారీ స్పందన దక్కించుకున్నవే.

ఒకరకంగా చెప్పాలంటే ఈ అన్ స్టాపబుల్ హీరోలకు, ఓటిటి సంస్థలకు ఒక కొత్త దారి చూపించింది. ఐడియా బాగుందని అందరూ ఇలాంటి టాక్ షోలే చేస్తే బాగుండదు కానీ వెరైటీగా ఆలోచిస్తే చిన్నితెరపై కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకోవచ్చని మాత్రం ఇది నిరూపించింది. సుమారు రెండున్నర కోట్ల దాకా రెమ్యునరేషన్ దీని కోసం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ షూటింగ్ పరంగా పెద్దగా రిస్క్ లేని ఈ షోకి ఇది పెద్ద మొత్తమే. సీజన్ 1ని మహేష్ బాబు ఎపిసోడ్ తో పూర్తి చేయనున్నారు. ఆల్రెడీ షూట్ చేశారు కాబట్టి ఇందులో అన్నయ్య రమేష్ బాబు కాలం చేయడానికి సంబందించిన ప్రస్తావన ఉండదు.

గతంలో నాగార్జున ఎవరు మీలో కోటీశ్వరుడు, బిగ్ బాస్ ద్వారా సక్సెస్ ఫుల్ యాంకర్ గా ఋజువు చేసుకోగా చిరంజీవి కోటీశ్వరుడు ప్రోగ్రాంని ఆ స్థాయిలో రన్ చేయించలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్, నానిలు ఒక్క సీజన్ కే పరిమితమయ్యారు. నెంబర్ వన్ యారితో రానా బాగానే మేనేజ్ చేశాడు. సమంతా ఆహా కోసం చేసిన షో అంతగా ఆకట్టుకోలేదు. వీళ్లందరినీ ఓవర్ టేక్ చేసి బాలయ్య ఇప్పుడు అన్ స్టాపబుల్ ని నెంబర్ వన్ గా నిలపడం విశేషం. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సెలబ్రిటీలు వస్తారనే టాక్ వచ్చింది ఇప్పటికైతే లేదు. సీజన్ 2లో ఇలాంటి స్పెషల్స్ చాలానే ఉండే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం

Also Read : Big Movies : థియేటరే ముద్దు ఓటిటి వద్దు

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş