iDreamPost

Ugadi 2024 Panchangam: క్రోధీ నామ సంవత్సరం వృశ్చిక రాశి జాతకం! ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

Ugadi 2024 Panchangam Scorpio or Vruchika Rasi Rasi Phalalu in Telugu: ఏప్రిల్ 9న ఉగాది జరుపుకుంటున్నాం. ఈ క్రోధీ నామ సంవత్సరం నాడు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?

Ugadi 2024 Panchangam Scorpio or Vruchika Rasi Rasi Phalalu in Telugu: ఏప్రిల్ 9న ఉగాది జరుపుకుంటున్నాం. ఈ క్రోధీ నామ సంవత్సరం నాడు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?

Ugadi 2024 Panchangam:  క్రోధీ నామ సంవత్సరం వృశ్చిక రాశి  జాతకం! ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

తెలుగు వారికి ఇష్టమైన పండుగ ఉగాది. చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. తెలుగు సంస్కృతిలో ఈ పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఆ రోజు షడ్రుసులు లేదా షడ్రసం అని పిలువబడే పదార్ధాన్ని దేవుడికి ప్రసాదంగా పెట్టి.. తర్వాత ప్రజలు సేవిస్తుంటారు. తీపి, చేదు, వగరు, పులుపు, లవణం, కారం వంటి ఆరు రుచులతో ఉగాది పచ్చడి చేసి.. ఆరగిస్తుంటారు. ఈ పండుగ నాడు ఇళ్లను శుభ్రం చేసి, స్నాన జపాదులను ఆచరించి..రంగుల ముగ్గులు వేసి.. మామిడి ఆకులు, బంతి పూలతో తోరణాలు కట్టి, కొత్త బట్టలు ధరించి పూజలు చేస్తారు. అనంతరం దేవాలయాలకు వెళుతుంటారు. పెద్దల దగ్గర నుండి పిల్లలు ఆశీర్వాదాలను తీసుకుంటున్నారు.

ఇక ఈ పండుగ నాడు జ్యోతిష్యులు చెప్పే పంచాంగ శ్రవణాన్ని, రాశి ఫలాలను వింటుంటారు. ఈ ఏడాది అంతా తమకు ఎలా ఉండబోతుంది.. భవిష్యత్ ఆశాజకంగా ఉందో లేదో తెలుసుకుంటారు. అందుకే టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చే పంచాగ శ్రవణాలను వీక్షిస్తుంటారు. దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు పొలిటికల్, పాడి పండలు ఎలా ఉండబోతున్నాయన్నది చెబుతుంటారు. అలాగే మన ఇంట్లో వ్యక్తుల జాతకాలు కూడా ఎలా ఉండబోతున్నాయో వింటుంటారు. ఈ ఏడాది క్రోధీ నామ సంవత్సరం మొదలు కానుంది. క్రోధీ అంటే కోపము, ఆవేశము. ఈ ఏడాదిలో ఈ రెండింటికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. మరీ ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం.

ఇక వృశ్చి రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. విశాఖ 4వ పాదం, అనురాధ 1,2,3,4 పాదాలు, జ్యేష్ట 1,2,3,4 పాదాల్లో పుట్టిన వారు వృశ్చిక రాశికి చెందిన వారు అవుతారు. ఇక ఏడాది వీరికి ఆదాయం-8 ఉండగా, వ్యయం 14గా కనిపిస్తోంది. అంటే వచ్చే రాబడి కన్నా పోయేది ఎక్కువగా కనిపిస్తుంది. ధన వృద్ధి కనిపిస్తున్నప్పటికీ.. అంత కన్నా ఎక్కువ మోతాదులో ఖర్చు పెడతారు. కాబట్టి ఆలోచించి ఖర్చు పెట్టడం ఉత్తమం. వీరికి బృహ స్పతి ఏడవ స్థానమందు సంచరిస్తున్నాడు. శని 4వ స్థానంలో, రాహువు పంచమంలో, కేతువు లాభ స్థానము నందు సంచరిస్తున్నాడు. ఇక రాజపూజ్యం-4, అవమానం-5 ఏళ్లుగా కనిపిస్తోంది.

మే నుండి వీరికి కలిసి రానుంది. గురు బలం అనుకూలంగా ఉండటం చేత ఉద్యోగాల్లో సంతృప్తిని పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కాస్త ఆలస్యమైన సఫలీకృతం అవుతుంది. వ్యాపారులకు లాభ కాలం. దాంపత్య జీవితం బాగుంటుంది. భూమి లేదా గృహం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. కొత్త ఇంటిని నిర్మించుకోవచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ధన సాయం పొందుతారు. కొన్ని ఆరోగ్య సమసస్యలు వెంటాడుతుంటాయి.. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక స్త్రీలు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక ప్రేమ, పెళ్లి విషయంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. సినీ రంగం, రాజకీయ, రైతులకు మధ్యస్థ ఫలితాలు ఉండనున్నాయి. శని, గురు, రాహులకు శాంతి పూజలు చేయడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

వృశ్చిక రాశి

  • ఆదాయం -8 ,
  • వ్యయం- 14
  • రాజ్యపూజ్యం- 4,
  • అవమానం 5
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి