iDreamPost

Ugadi 2024 Panchangam: క్రోధి నామ సంవత్సరం మీన రాశి జాతకం! ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

Ugadi 2024 Panchangam Meena Rasi Phalalu in Telugu: తెలుగు వారి పండుగైన ఉగాదిని ఈ ఏడాది ఏప్రిల్ 9న జరుపుకుంటున్నాం. క్రోధీ నామ సంవత్సరంగా పిలవబోతుంది. క్రోధీ అంటే కోపం, ఆగ్రహం. మరీ ఈ ఏడాది తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?

Ugadi 2024 Panchangam Meena Rasi Phalalu in Telugu: తెలుగు వారి పండుగైన ఉగాదిని ఈ ఏడాది ఏప్రిల్ 9న జరుపుకుంటున్నాం. క్రోధీ నామ సంవత్సరంగా పిలవబోతుంది. క్రోధీ అంటే కోపం, ఆగ్రహం. మరీ ఈ ఏడాది తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?

Ugadi 2024 Panchangam: క్రోధి నామ సంవత్సరం మీన రాశి జాతకం! ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇక ఉగాది పర్వదినం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది పంచాగ శ్రవణం, రాశి ఫలాలు. ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు పండితులు, జ్యోతిశాస్త్ర నిపుణులు ఆ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి.. దేశవ్యాప్తంగా పరిస్థితులు, వాతావరణం, పాడి పంటలు ఎలా ఉండబోతున్నాయో చెబుతుంటారు.

ఉగాది నాడు ప్రతి ఒక్కరు పంచాగ శ్రవణం చేస్తారు. రాజకీయ నాయకులు సైతం.. తమ పార్టీ కార్యాలయాలు, ఇండ్లలో పంచాగ శ్రవణం ఏర్పాటు చేయించుకుంటారు. ఇక రాశుల వారీగా చూసుకుంటే.. ఈ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందా. ఈ ఏడాది మేష రాశి వారికి ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి.. జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చేప్పారంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశి వారికి ఈ ఏడాది సామాన్యంగా ఉంటుంది. రైతులు పంటల దిగుబడి సరిగా రాక ఇబ్బందులు పడతారు. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు. కొన్ని శాఖల ఉద్యోగస్తులపై ఏసీబీ దాడులు జరిగే అవకాశం ఉంది. మహిళా ఉద్యోగులు ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాదిలో వీరు కొన్ని సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉందని.. కానీ అంతిమంగా వారే విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు.కాంట్రాక్టర్లకు ఆకస్మిక ధన లాభం, రాజకీయ నాయకులకు పదవీ గండం ఉండే అవకాశం. విద్యార్థులు సరైన మార్కులు సాధించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సరస్వతి ద్వాదశ నామాలు చదివి జ్ఞాపక శక్తిని పెంచుకొని మంచి మార్కులు సాధించవొచ్చు. ఎవరి మాటలపై ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం వల్ల అనర్ధాలకు దారి తీస్తుంది. ఎవరినీ అతిగా నమ్మి మోసపోవొద్దు.

క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి ఉద్యోగులకు రాజకీయ ఒత్తిళ్లు, చికాకులు ఎక్కువగా ఉండబోతున్నాయి.డబ్బు విషయంలో ఇబ్బందులు, అధిక ఖర్చులు ఉంటాయి. ఖర్చుల విషయంల ఆచీతూచి అడుగులు వేయకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వ్యాపారులకు ఈ ఏడాది కలిసి రాదు. భారీ నష్టాలు కలిగే సూచన కనిపిస్తుంది. కుటుంబ సమస్యలు బాధిస్తాయి. కోర్టు వ్యవహారాలు చికాకు పెట్టిస్తాయి. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. రైతాంగానికి ఈ ఏడాది అనుకూలంగా లేదు. మీన రాశి వారికి ఆర్థికపరంగా అనుకూలంగా లేదు. అప్పుల బాధలు పెరుగుతాయి.. ధనం ఎలా వస్తుంది..అలాగే పోతుంది. అప్పు చేయవొద్దు.. అప్పు ఇవ్వవొద్దు. ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది.

మీన రాశి వారికి ఈ ఏడాది కెరీర్ పరంగా మధ్యస్థంగా ఉంది. నిరుద్యోగులు ఉద్యోగ సాధన విషయంలో కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు, ఉన్నతాధికారుల వల్ల పని ఒత్తిళ్లు బాగా పెరిగిపోయే సూచన ఉంది. ప్రమోషన్లు వంటివి ఈ ఏడాది ఆశించిన ఫలితం ఉండకపోవొచ్చు. ఈ రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే.. అంత సానుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. బీపీ, షుగర్ వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

ఇక ఆదాయ, వ్యయాల విషయానికి వస్తే ఈ ఏడాది మేష రాశి వారికి

  • ఆదాయం-11,
  • వ్యయం-5,
  • రాజపూజ్యం-2,
  • అవమానం-4 గా ఉంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి