iDreamPost

Ugadi 2024 Panchamgam: క్రోధీ నామ సంవత్సరం కుంభరాశి జాతకం! ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

  • Published Apr 08, 2024 | 1:21 PMUpdated Apr 08, 2024 | 9:20 PM

Ugadi 2024 Panchamgam, Kumbha Rasi Phalalu in Telugu: తెలుగు వారికి ఏప్రిల్ 9నుంచి కొత్త సంవత్సరం మొదలవ్వబోతుంది. ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరంగా పిలువబడుతున్న ఉగాది రోజున పంచాంగ శ్రవణం విని వారి వారి జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. మరి ఈ ఏడాది కుంభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు అందనున్నాయో చూసేద్దాం.

Ugadi 2024 Panchamgam, Kumbha Rasi Phalalu in Telugu: తెలుగు వారికి ఏప్రిల్ 9నుంచి కొత్త సంవత్సరం మొదలవ్వబోతుంది. ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరంగా పిలువబడుతున్న ఉగాది రోజున పంచాంగ శ్రవణం విని వారి వారి జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. మరి ఈ ఏడాది కుంభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు అందనున్నాయో చూసేద్దాం.

  • Published Apr 08, 2024 | 1:21 PMUpdated Apr 08, 2024 | 9:20 PM
Ugadi 2024 Panchamgam: క్రోధీ నామ సంవత్సరం కుంభరాశి జాతకం! ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇక ఉగాది పర్వదినం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది పంచాగ శ్రవణం, రాశి ఫలాలు. ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు పండితులు, జ్యోతిశాస్త్ర నిపుణులు ఆ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి.. దేశవ్యాప్తంగా పరిస్థితులు, వాతావరణం, పాడి పంటలు ఎలా ఉండబోతున్నాయో చెబుతుంటారు.

ఉగాది నాడు ప్రతి ఒక్కరు పంచాగ శ్రవణం చేస్తారు. రాజకీయ నాయకులు సైతం.. తమ పార్టీ కార్యాలయాలు, ఇండ్లలో పంచాగ శ్రవణం ఏర్పాటు చేయించుకుంటారు. ఇక రాశుల వారీగా చూసుకుంటే.. ఈ క్రోధి నామ సంవత్సరంలో కుంభ రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది కుంభ రాశి వారికి ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి.. జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చేప్పారంటే..

జోతిష్య శాస్త్ర ప్రకారం కుంభ రాశి వారికి.. ఈ ఏడాది కాస్త చెడు ఫలితాలే ఎదురవ్వనున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో గొడవలు, వాగ్విదాలు, చిరాకులు, అనారోగ్య సమస్యలు వేదించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రాజకీయ రంగాల వారు ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసే వారికి కూడా కాస్త ఇబ్బంది కలగనుంది. ఈ ఏడాది బృహస్పతి 4వ స్థానమునందు, శని జన్మరాశి స్థానము నందు అలాగే.. రాహువు వాక్‌స్థానము యందు, కేతువు అష్టమ స్థానమునందు సంచరించనున్న కారణంగా కుంభ రాశి వారికి.. ప్రతికూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని.. పండితులు సూచిస్తున్నారు.

అంతేకాకుండా వ్యాపార రంగం వారికి కూడా ఈ ఏడాది అంత అనుకూలంగా లేదు. ధనపరమైన విషయాలలో కూడా ఈ ఏడాది కుంభ రాశి వారికి ఇబ్బంది కలుగుతుంది. విద్యార్థుల విషయానికొస్తే ఈ ఏడాది కొంచెం కష్టపడాల్సిన సమయం. సినీ మీడియా రంగాల వారికి కూడా గడ్డు కాలమే ఎదురుకానుంది. పైగా కొంతమంది మాటల కారణంగా కుంభ రాశి వారు బాధపడే పరిస్థితులు ఏర్పడనున్నాయి. అలాగే స్త్రీలకు కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు వేధిస్తాయి. కానీ, ప్రేమ, పెళ్లి విషయాలలో మాత్రం కుంభ రాశి వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. పెళ్లి కానీ యువతి యువకులకు వివాహ యోగం కనిపిస్తుందని పండితులు పేర్కొన్నారు.

ఇక ఆదాయ, వ్యయాల విషయానికి వస్తే ఈ ఏడాది కుంభ రాశి వారికి

  • ఆదాయం-14,
  • వ్యయం-14,
  • రాజపూజ్యం-6,
  • అవమానం-1 గా ఉంది.

 గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి