iDreamPost
android-app
ios-app

TVS నుంచి సరికొత్త EV.. సింగిల్ ఛార్జ్ తో 150KM రేంజ్

  • Published May 15, 2024 | 10:09 PM Updated Updated May 15, 2024 | 10:09 PM

ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొనుగోలుకు వాహనదారులు మొగ్గుచూపుతున్నారు. ప్రముఖ టూవీలర్ సంస్థ నుంచి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లు మార్కెట్ లోకి విడుదలయ్యాయి.

ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొనుగోలుకు వాహనదారులు మొగ్గుచూపుతున్నారు. ప్రముఖ టూవీలర్ సంస్థ నుంచి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లు మార్కెట్ లోకి విడుదలయ్యాయి.

TVS నుంచి సరికొత్త EV.. సింగిల్ ఛార్జ్ తో 150KM రేంజ్

ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతున్న కొద్ది సరికొత్త మోడల్స్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీలు ఆధునిక టెక్నాలజీతో అదిరిపోయే ఫీచర్లతో, లేటెస్ట్ డిజైన్స్ తో రూపొందిస్తున్నాయి. ధరలు కూడా అందుబాటులోనే ఉండడంతో ఈవీలకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు కంపెనీలకు చెందిన ఈవీలు ఆటో మొబైల్ రంగంలో హవా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త ఈవీ స్కూటర్ మార్కెట్ లోకి ప్రవేశించింది. ప్రముఖ టూవీలర్ సంస్థ టీవీఎస్ తక్కువ ధరలోనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ లను విడుదల చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ పేరిట సరికొత్త ఈవీలను తీసుకొచ్చింది.

టీవీఎస్ ఐక్యూబ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్, సరికొత్త, బేస్ వేరియంట్ ఇది 2.2 కేడబ్య్లూహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. టీవీఎస్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది కాకుండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 75 కి.మీ. ఇది 5 అంగుళాల రంగు టీఎఫ్టీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా, వెహికల్ క్రాష్, టో అలర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కేడబ్య్లూహెచ్ మోడల్ రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది వాల్‌నట్ బ్రౌన్, పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్‌లను పొందుతుంది. సింగిల్ ఛార్జ్ తో 75 కి.మీ. ప్రయాణించొచ్చు. దీని ప్రారంభ ధర రూ.94,999 నుండి ప్రారంభమవుతుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 3.4 కిలోవాట్ల బ్యాటరీ కలిగి ఉంది. ఈ మాడల్‌ సింగిల్ ఛార్జ్ తో 100 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీని ధర రూ. 1.55 లక్షలు. 5.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్‌ సింగిల్‌ చార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఇది 4.18 గంటల్లో 80 శాతం వరకు బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. గంటకు 82 కిలోమీటర్ల వేగం కలిగిన ఈ మాడల్‌ ధర రూ.1,85,373గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాపర్ బ్రాంజ్ మ్యాట్, కోరల్ సాండ్ శాటిన్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది.

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişJOJOBET GİRİŞholiganbetjojobetjojobet girişgamdomgrandpashabetCasibom