iDreamPost

ఆడిషన్ కు వెళ్తే రాత్రికి రమ్మన్నాడు.. నటి సంచలన కామెంట్స్!

  • Author Soma Sekhar Updated - 11:58 AM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 11:58 AM, Fri - 3 November 23
ఆడిషన్ కు వెళ్తే రాత్రికి రమ్మన్నాడు.. నటి సంచలన కామెంట్స్!

క్యాస్టింగ్ కౌచ్.. ఇండస్ట్రీలో తరచుగా వినిపించే పదం. చిన్న నటీమణుల దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోయిన్ల వరకు చాలా మంది తమ లైఫ్ లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ బుల్లితెర నటి క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. యాడ్ షూట్ కోసం ఆడిషన్ కు వెళ్తే రాత్రికి రమ్మన్నాడని తన లైఫ్ లో జరిగిన భయంకర సంఘటన గురించి చెప్పుకొచ్చింది బుల్లితెర నటి మృణాల్ నవేల్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తనకు జరిగిన చేదు అనుభవం గురించి వెల్లడించింది.

స్టార్ హీరోతో యాడ్ షూట్ అని ఆడిషన్ కు వెళ్లిన బుల్లితెర నటికి భయంకరమైన సంఘటన ఎదురైంది. తన లైఫ్ లో జరిగిన సంఘటనను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది బుల్లితెర నటి మృణాల్ నవేల్. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..”నేను టీవీ యాడ్స్ కోసం ఆడిషన్స్ కు వెళ్తున్న సమయంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఆ హీరోతో యాడ్ షూట్ కోసం ఆడిషన్ కు వెళ్లాను. అక్కడ క్యాస్టింగ్ ఏజెంట్ ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేశామని, అందులో మీరొకరని చెప్పాడు. మీరు సెలక్ట్ అయితే హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి యాడ్ లో నటించాల్సి వస్తుందని తెలిపాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతి రోజు నాకో మెసేజ్ వచ్చింది.

మీరు ఈ యాడ్ లో సెలక్ట్ కావాలంటే కాంప్రమైజ్ కావాలని క్యాస్టింగ్ ఏజెంట్ చెప్పాడు. నాకు అప్పటికే అతడి ఉద్దేశం అర్దమైంది. అయితే అతడు నా నుంచి సరిగ్గా ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలని ఏం కాంప్రమైజ్ అని అడిగాను. దానికతను రాత్రంతా ఇద్దరం కలుసుకుని చిల్ అవ్వడమే అని సమాధానం ఇచ్చాడు. దీంతో నాకు పట్టరాని కోపం వచ్చి నోటికి వచ్చిన తిట్లన్ని తిట్టాను” అని చెప్పుకొచ్చింది మృణాల్ నవేల్. ఆ తర్వాత అతడు తన మెసేజ్ లను డిలీట్ చేసుకున్నాడు. అతడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ.. మీరు ఒప్పుకుంటే మీకు సినిమా ఛాన్స్ లు కూడా ఇస్తామని చెప్పినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం మృణాల్ నవేల్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి