iDreamPost

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TTDలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం!

తిరుమలన శ్రీవారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని పరితపిస్తుంటారు భక్తులు. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

తిరుమలన శ్రీవారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని పరితపిస్తుంటారు భక్తులు. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TTDలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం!

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీవారి ఆలయంలో ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం టీటీడీ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్(ఏటీవో) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు. ఇక విద్యార్హత విషయానికొస్తే.. బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. కాగా అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల సంఖ్య: 56

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు

అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు..

అర్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి..

వయస్సు

01.07.2023 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ (ఇన్‌స్ట్రక్టర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ

రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు

జీతం..

ఏఈఈ పోస్టులకి నెలకు రూ.57,100-1,47,760.. ఏఈ పోస్టులకి రూ.48,440-1,37,220.. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500గా ఉంటుంది.

దరఖాస్తు విధానం

ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభం

26-10-2023

దరఖాస్తులకు చివరి తేదీ

23-11-2023

టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌

https://www.tirumala.org/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి