iDreamPost

ఆగని ఇంటర్ విద్యార్థుల మరణాలు.. ఇప్పుడు మరో విద్యార్థి

తెలంగాణ ఇంటర్ ఫలితాలు కొంత మంది విద్యార్థులకు ఆనందాన్ని నింపితే.. కొంత మంది విద్యార్థులకు మాత్రం విషాదాన్ని నింపింది. ఒక్క రోజులో ఏడుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా

తెలంగాణ ఇంటర్ ఫలితాలు కొంత మంది విద్యార్థులకు ఆనందాన్ని నింపితే.. కొంత మంది విద్యార్థులకు మాత్రం విషాదాన్ని నింపింది. ఒక్క రోజులో ఏడుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా

ఆగని ఇంటర్ విద్యార్థుల మరణాలు.. ఇప్పుడు మరో విద్యార్థి

పరీక్షలు కన్నా.. ఫలితాలు విద్యార్థుల జీవితాలో ఆటలాడుకుంటున్నాయి. ఎగ్జామ్స్‌లో ఫెయిలైన విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. తల్లిదండ్రులు తిడతారని, కొడతారని, అలాగే బంధువులు, స్నేహితులు అవమానిస్తారన్న ఆత్మనూన్యత భావంతో ప్రాణాలను తీసుకుంటున్నారు. తెలంగాణలో బుధవారం ఉదయం ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించింది బోర్డు. ఫలితాలు విడుదలైన 24 గంటలు గడవక ముందే ఏడుగురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అలా ఫలితాలు వచ్చాయో లేదో గంటలోనే మంచిర్యాల జిల్లా దొరగారి పల్లెకు చెందిన గట్టిక తేజశ్విని ఆత్మహత్య చేసుకుంది.

ఈ అమ్మాయితో పాటు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్ (17), హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన హరిణి, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇప్పుడు మరో విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే సభాష్ నగర్‌కు చెందిన రాజేంద్ర కుమారుడు నూన్ సావత్ అరవింద్ స్థానికంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

తాజాగా విడుదలైన ఫలితాల్లో గణితంలో తప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చాలా బాధపడగా.. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఓదార్చారు. అయినా.. ఫెయిల్ అయ్యానన్న బాధ మనస్సును తొలిచేసింది. బుధవారం అందరు పడుకున్న సమయంలో ఇంటి ఆవరణలో ఉన్న రాడ్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొద్దున్న కుటుంబ సభ్యులు లేచి చూసే సరికి విగతజీవిగా కనిపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ మరణించినట్లు వెల్లడించారు వైద్యులు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మరణించారు.  ఈ సమయం చాలా కీలకమని, పిల్లల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాలని సూచిస్తున్నారు వైద్యులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి