iDreamPost

తొలిసారి కేసీఆర్‌, రేవంత్‌ సెంటిమెంట్లు తారుమారు.. ఎవరికి కలిసొస్తుందో?

  • Published Nov 07, 2023 | 1:43 PMUpdated Nov 07, 2023 | 1:43 PM

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇద్దరు అగ్ర నేతలు కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిలు తొలిసారి సెంటిమెంట్‌ను తారుమారు చేస్తూ.. ముందుకు సాగారు. లక్కీ నంబర్లను కాకుండా ముహుర్త బలం ప్రకారం ముందుకు వెళ్లారు. ఏ విషయంలో అంటే..

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇద్దరు అగ్ర నేతలు కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిలు తొలిసారి సెంటిమెంట్‌ను తారుమారు చేస్తూ.. ముందుకు సాగారు. లక్కీ నంబర్లను కాకుండా ముహుర్త బలం ప్రకారం ముందుకు వెళ్లారు. ఏ విషయంలో అంటే..

  • Published Nov 07, 2023 | 1:43 PMUpdated Nov 07, 2023 | 1:43 PM
తొలిసారి కేసీఆర్‌, రేవంత్‌ సెంటిమెంట్లు తారుమారు.. ఎవరికి కలిసొస్తుందో?

సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరకి కొన్ని అంశాల పట్ల ప్రత్యేక నమ్మకాలుంటాయి. నంబర్లు, రంగులు, వారాలు ఇలా కొన్ని ప్రత్యేక నమ్మకాలను ఫాలో అవుతారు. సినీ, రాజకీయ సెలబ్రిటీల విషయానికి వస్తే.. ఈ నమ్మకాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాలన్నా, నిర్ణయాలను అమలు చేయాలన్న.. ఈ సెంటిమెంట్లను ఫాలో అవుతారు. ఇక రాజకీయాల్లో ప్రతి నాయకుడికి ప్రత్యేక సెంటిమెంట్లు ఉంటాయి. ఎన్నికల నామినేషన్‌, ప్రచార కార్యక్రమాలు ప్రారంభించడం వంటి విషయాల్లో.. ఈ సెంటిమెంట్లను కచ్చితంగా ఫాలో అవుతారు.

ఇక గతంలో ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఎన్టీఆర్‌.. నంబర్‌ 9 అంటే తెగ మ‌క్కువ చూపేవారు. ఏ కార్యక్రమం తలపెట్టినా 9 నంబర్‌ వచ్చేలా చూసుకునేవారు. అలానే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఇలాంటి సెంటిమెంటే ఉంది. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆయన ఏ పని ప్రారంభించినా.. తన లక్కీ నంబర్‌ 6ను పాటిస్తూ వచ్చారు.

తొలిసారి సెంటిమెంట్‌ను కాదని..

కానీ తొలిసారి కేసీఆర్‌ తన సెంటిమెంట్‌ను పక్కకు పెట్టారు. 2018 ఎన్నికల్లో అసెంబ్లీ రద్దు మొదలు.. అభ్యర్థుల ప్రకటన వరకు సెంటిమెంట్‌ను ఫాలో అయిన కేసీఆర్‌.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమాయానికి వచ్చే సరికి.. దానికి బ్రేక్‌ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో లక్కీ నంబర్‌ను కాకుండా ముహూర్తబలం ప్రకారం ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల ప్రకటన మెుదలు నామినేషన్ వేసే వరకు లక్కీ నంబర్ సెంటిమెంట్‌ను కాకుండా ముహూర్త బలం ప్రకారమే ముందుకు వెళ్తున్నారు కేసీఆర్‌.

దానిలో భాగంగా ఈ సారి తన లక్కీ నంబర్‌ 6ను కాదని.. నంబర్‌ 9న నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్తున్నారు కేసీఆర్‌. అనగా నవంబర్‌ 9న గురువారం ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో కేసీఆర్‌ నామినేషన్‌ వేయనున్నారు. కేసీఆర్‌ సెంటిమెంట్‌కు బ్రేక్‌ వేయడం ఇదే తొలసారి.

రేవంత్‌ సెంటిమెంట్‌కు బ్రేక్‌..

ఇక మరో నేత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా ఈ సారి సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేశారు. ఆయన లక్కీ నంబర్‌ 9. కానీ ఈ ఎన్నికల్లో ఆయన లక్కీ నంబర్‌ సెంటిమెంట్‌ను పక్కకు పెట్టి.. ముహుర్తబలం ప్రకారం ముందుకు సాగారు. దానిలో భాగంగానే నవంబర్‌ 6న నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఇద్దరు కీలక నేతలు సెంటిమెంట్‌ను పక్కకు పెట్టడం ఇదే మొదటి సారి.. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు జనాలు.

రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి కేసీఆర్‌ 6 సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వస్తున్నారు. కొత్త సచివాలంయంలో కూడా తన ఆఫీస్‌ను ఆరో అంతస్తులోనే ఏర్పాటు చేసుకున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించిన కేసీఆర్‌.. సెప్టెంబరు 6న అసెంబ్లీని రద్దు చేశారు. 2018 ఎన్నికల్లో 6 అదృష్ట సంఖ్య వచ్చేలా 105 మందితో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఈసారి మాత్రం ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టారు.

2023 అసెంబ్లీ ఎన్నికల కోసం ముహుర్త బలాన్ని ఫాలో అవుతున్నారు. దానిలో భాగంగా ఆగస్టు 21న మంచి ముహూర్తాలు ఉండటంతో 115 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. నామినేషన్‌ విషయంలోనూ ముహుర్త బలాన్ని ఫాలో అయ్యారు కేసీఆర్‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి