iDreamPost

గజ్వేల్‌లో కేసీఆర్‌ వర్సెస్‌ ఈటల.. బీజేపీ వ్యూహం ఇదేనా..?

  • Published Oct 22, 2023 | 5:44 PMUpdated Oct 22, 2023 | 5:44 PM

బీజేపీ నేడు తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీనిలో ఈటల రాజేందర్‌ పోటీ చేస్తోన్న నియోజకవర్గాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేసీఆర్‌తో తలపడటం కోసం ఈటల గజ్వెల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి ఈటల బలమేంటి అంటే..

బీజేపీ నేడు తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీనిలో ఈటల రాజేందర్‌ పోటీ చేస్తోన్న నియోజకవర్గాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేసీఆర్‌తో తలపడటం కోసం ఈటల గజ్వెల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి ఈటల బలమేంటి అంటే..

  • Published Oct 22, 2023 | 5:44 PMUpdated Oct 22, 2023 | 5:44 PM
గజ్వేల్‌లో కేసీఆర్‌ వర్సెస్‌ ఈటల.. బీజేపీ వ్యూహం ఇదేనా..?

తెలంగాణలో ఎన్నికల పోరు మొదలయ్యింది. పార్టీలన్ని గెలుపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్ని తమ అభ్యుర్థులకు సంబంధించి పూర్తిగా, తొలి విడతను జాబితాను విడుదల చేశాయి. ప్రచార కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా కారుకు బ్రేక్‌ వేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక నేడు అనగా ఆదివారం నాడు బీజేపీ 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. జాబితాలో ఉన్న కొందరి పేర్లు.. వారు పోటీ చేసే స్థానాలకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌ రెండు స్థానాల్లో పోటీ చేయడం.. అందునా సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వెల్‌ బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.

బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఈటల రాజేందర్‌ పేరు ఉంది. పైగా ఆయన రెండు స్థానాల్లో బరిలో దిగుతున్నారు. ఒకటి తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ కాగా, మరొకటి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్. ఇక ప్రస్తుత జాబితాలో ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించడంతో ఇది రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక త్వరలోనే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. గజ్వెల్‌లో కేసీఆర్‌, ఈటల మధ్య టఫ్‌ ఫైట జరగనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో.. తాను కేసీఆర్‌పై పోటీ చేస్తానని.. ఈటల ఎప్పటి నుంచో చెబుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఆత్మగౌరవం నినాదంతో ఈటల గజ్వెల్‌ ఎన్నికల బరిలో నిలవనున్నారు అనే టాక్‌ వినిపిస్తోంది.

కేసీఆర్‌ తొలి ప్రాధాన్యం గజ్వెల్‌..

ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ కూడా రెండు స్థానాల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఒకటి కామారెడ్డి కాగా.. మరొకటి గజ్వేల్‌. ఇక గజ్వెల్‌లో సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. నియోజకవర్గంలో ఆయనకు బలమైన మద్దతు ఉన్నది. అయితే, గతకొంతకాలంగా.. గజ్వెల్‌ క్యాడర్‌లో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు  వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కేసీఆర్ గజ్వేల్ నియోజవకర్గంలోని నేతలు, క్యాడర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాను కామారెడ్డికి వెళ్లనని.. తనకు ఇల్లు, ముంగిలి ఉన్న గజ్వేల్‌ను వీడేది లేదని హామీ ఇచ్చారు. ఒక రకంగా గజ్వేల్‌ను తన తొలి ప్రాధాన్యంగా సంకేతాలు ఇచ్చారు కేసీఆర్‌.

పైగా ఇక్కడ కేసీఆర్‌కు బలమైన ఓటు బ్యాంక్‌ ఉంది. ఇక్కడ కేసీఆర్‌పై పోటీ అంటే మాటలు కాదు అంటున్నారు రాజకీయ పండితులు. కేసీఆర్‌కు కంచుకోట అయిన గజ్వెల్‌లో ఆయనపై తల పడటం అంటే ఒక రకంగా కొండను ఢీకొట్టడం లాంటిదే అంటున్నారు. అయినా సరే ఈటల ఇక్కడ పోటీ చేస్తానని కచ్చితంగా చెప్పడమే కాక.. ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగనుండటంతో.. గజ్వెల్‌ నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈటల బలమేంటి..

కేసీఆర్‌పై పోటీ అందునా ఆయన కంచుకోట గజ్వెల్‌ బరిలో నిలబడాలంటే.. సామాన్యమైన విషయం కాదు. అయినా సరే ఈటల.. గజ్వెల్‌ బరిలో నిలుస్తుండటం రాజకీయ వర్గాల్లో​ హాట్‌ టాపిక్‌గా మారింది. దాంతో అసలు ఈటల బలమేంటి.. ఆయన అంత ధీమాగా ఎలా ఉండగలగుతున్నారు అనే దాని మీద రాజకీయ వర్గాల్లో​ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక ఈటల బలం విషయానికి వస్తే.. సామాజిక వర్గమే.. ఆయనకు అతి పెద్ద బలం.కేవలం ఈటల విషయంలో మాత్రమే కాక.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితల్లో ఈ సామాజిక వర్గమే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.

హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ మూకుమ్మడిగా దిగి ప్రచారం చేసినా హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ బారీ మెజారిటీతో విజయం సాధించారు. దీని వెనుక ప్రధాన కారణఫం ఈ సామాజిక వర్గమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. దాంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఈ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నదని అంటున్నారు రాజకీయ పండితులు.

అంతేకాక ఈటల రాజేందర్ బీసీ కమ్యూనిటీకి చెందిన బలమైన నేత. పైగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లోనూ ఈటల రాజేందర్.. ఈ సామాజిక వర్గంపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ పండితులు. అదీగాక, గజ్వేల్‌లోని కొన్ని గ్రామాల్లో ముదిరాజ్ సహా పలు బీసీ సెక్షన్లు ఈటల రాజేందర్‌కు మద్దతుగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈటల ఇంత ధీమాగా కేసీఆర్‌పై పోటీకి రెడీ అయ్యారనే టాక్‌ వినిపిస్తోంది. మరి గజ్వెల్‌లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే.. డిసెంబర్‌ 3 వరకు వేచి చూడాలి. గజ్వెల్‌ బరిలో గెలుపెవరిదని భావిస్తున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి