iDreamPost

వారికి వరం.. రూపాయి ఖర్చుతో పెళ్లి.. ఎక్కడంటే?

పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే వారికి ఓ వరం. వివాహాల కోసం లక్షల రూపాయలు ఖర్చవుతున్న ఈ రోజుల్లో కేవలం ఒక్క రూపాయి ఖర్చుతోనే వైభవంగా పెళ్లి చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ ఎక్కడంటే?

పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే వారికి ఓ వరం. వివాహాల కోసం లక్షల రూపాయలు ఖర్చవుతున్న ఈ రోజుల్లో కేవలం ఒక్క రూపాయి ఖర్చుతోనే వైభవంగా పెళ్లి చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ ఎక్కడంటే?

వారికి వరం.. రూపాయి ఖర్చుతో పెళ్లి.. ఎక్కడంటే?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఓ మధురమైన ఘట్టం. పెళ్లి వేడుక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటరు వధూవరులు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ మొదలుకొని కళ్యాణ వేదిక, డ్రెస్సులు, ఇలా ప్రతిఒక్కటి రిచ్ గా ఉండేలని ఆలోచిస్తుంటారు. మరి ఈ రోజుల్లో పెళ్లి అంటే మాటలు కాదు. వివాహం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. భాజాభజంత్రీలు, భోజనాల ఖర్చులు అన్ని కలగలిపి తడిసిమోపెడవుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో అసలు ఖర్చే లేకుండా పెళ్లి జరిగితే ఎంత బావుంటుందో అని ఆలోచించే వారు కూడా లేకపోలేదు. అయితే ఒక్క రూపాయి ఖర్చుతోనే వివాహం పూర్తయ్యే అవకాశం కల్పిస్తోంది రూపాయి ఫౌండేషన్. అయితే ఈ అవకాశం అందరికీ కాదండోయ్ కేవలం దివ్యాంగులకు మాత్రమే.

అమ్మ ఫౌండేషన్‌ నిర్వాహకులు నాగమల్ల అనిల్‌కుమార్‌, అరుణ ఇటీవల రూపాయి ఫౌండేషన్‌ పేరుతో సేవా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దివ్యాంగులకు వివాహాలు చేస్తామంటున్నారు నిర్వాహకులు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రూపాయితో తమ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే దివ్యాంగ జంటకు ఉచితంగా పెండ్లి చేస్తామని చెప్తున్నారు. రూపాయి ఫౌండేషన్ తీసుకున్న నిర్ణయం దివ్యాంగులకు వరంగా మారనుంది.

గత 15 ఏళ్లుగా వందకుపైగా అనాథలు, దివ్యాంగ జంటలకు వివాహాలు జరిపించింది అమ్మ ఫౌండేషన్‌. ఇప్పుడు రూపాయి ఫౌండేషన్ తో ఒక్క రూపాయి ఖర్చుతోనే వివాహం జరిపించనుంది. కాగా సంగారెడ్డికి చెందిన ప్రవళికకు మేడ్చల్‌కు చెందిన మట్టా రమేశ్‌తో సైదాబాద్‌ లో నేడు వివాహం జరిపించారు. ఇలాంటి వివాహాల కోసం ఆర్థిక చేయూతనిచ్చేందుకు దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని రూపాయి ఫౌండేషన్‌ వారు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి