iDreamPost

ట్రూకాలర్ వాడుతున్నారా? ఐతే మీకు సూపర్ గుడ్ న్యూస్!

Truecaller Artificial Intelligence: స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టడం కోసం ట్రూకాలర్ ని యూజ్ చేస్తుంటారు చాలా మంది. అయినప్పటికీ ఇంకా స్కామర్లు మోసాలు చేస్తూనే ఉన్నారు. ఫోన్ చేసేది ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో స్కామర్లను గుర్తించి జరగబోయే నష్టాన్నుంచి బయటపడేసేలా ట్రూకాలర్ ఒక సరికొత్త ఫీచర్ ని డెవలప్ చేసింది.

Truecaller Artificial Intelligence: స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టడం కోసం ట్రూకాలర్ ని యూజ్ చేస్తుంటారు చాలా మంది. అయినప్పటికీ ఇంకా స్కామర్లు మోసాలు చేస్తూనే ఉన్నారు. ఫోన్ చేసేది ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో స్కామర్లను గుర్తించి జరగబోయే నష్టాన్నుంచి బయటపడేసేలా ట్రూకాలర్ ఒక సరికొత్త ఫీచర్ ని డెవలప్ చేసింది.

ట్రూకాలర్ వాడుతున్నారా? ఐతే మీకు సూపర్ గుడ్ న్యూస్!

ఏఐ టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడు అనేక మోసాలు జరుగుతున్నాయి. డీప్ ఫేక్ అనే ఏఐ టెక్నాలజీని వాడుకుని సెలబ్రిటీల ముఖాలను తగిలించి ఫేక్ వీడియోలు చేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో యూట్యూబర్స్ ముఖాలను స్వాప్ చేసి సబ్ స్క్రైబర్స్ కి కాల్ చేసి డబ్బులు అడుగుతారు. ఒక వ్యక్తి తన ఫేస్ కి ఒక అమాయకుడి ఫేస్ ని పెట్టుకుని వాట్సాప్ లో ఆ వ్యక్తి కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి వీడియో కాల్స్ ఇబ్బందుల్లో ఉన్నా సహాయం చేయమని అడుగుతాడు. మనిషి కనబడుతున్నాడు కదా నిజమే అనుకుని చాలా మంది డబ్బులు పే చేస్తారు. అయితే ఈ మోసాలు ఇప్పుడు ఆడియో కాల్స్ కి కూడా వచ్చేసాయి. ఫోన్ లో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

ట్రూకాలర్ ఇన్ స్టాల్ చేసుకుంటే స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టచ్చు అని అనుకుంటాం. కానీ ఎంత చేసినా కూడా ఇంకా ఈ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అని లిఫ్ట్ చేస్తే ఇక అంతే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ ఏఐ కాల్ స్కానర్ ఫీచర్ ని లాంఛ్ చేసింది. ట్రూకాలర్ ఆండ్రాయిడ్ యాప్ లో ఏఐ సింథసైస్డ్ లేదా క్లోన్డ్ వాయిస్ ని డిటెక్ట్ చేసేలా ఒక ఫీచర్ ని అయితే తీసుకొచ్చింది. అంటే ఏఐ వాయిస్ అయినా లేదా డీప్ ఫేక్ ఆడియోని గుర్తించడం అన్న మాట. కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీస్ ప్రొవైడర్ ట్రూకాలర్ ప్రకారం.. మనుషుల వాయిస్ కి, ఏఐ సింథసైస్డ్ వాయిస్ కి మధ్య ఉన్న తేడాలను గుర్తించి.. స్కామ్ లు, మోసాల నుంచి యూజర్స్ ని రక్షించే వీలు ఉంటుంది.

యూజర్ ఫోన్ కి ఏదైనా అనుమానాస్పదమైన కాల్ వచ్చినప్పుడు.. ట్రూకాలర్ ఫోన్ కాల్ ఇంటర్ఫేస్ మీద ‘ఏఐ కాల్ స్కానర్’ బటన్ పై క్లిక్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన వెంటనే.. అది కాల్ మాట్లాడుతుండగా వాయిస్ శాంపిల్ ని రికార్డ్ చేస్తుంది. ఈ క్రమంలో అవతల ఫోన్ కాల్ లో ఉన్న వాయిస్ మనిషిదా? లేక ఏఐ దా? అనేది గుర్తిస్తుంది. ఒకవేళ ఏఐ వాయిస్ ని తేలితే వెంటనే ఈ ఫీచర్ యూజర్ ని అలర్ట్ చేస్తుంది. యూజర్ వెంటనే అలర్ట్ అయ్యి కాల్ డిస్కనెక్ట్ చేయవచ్చు. అయితే ఈ ఏఐ కాల్ స్కానర్ ఫీచర్ ప్రస్తుతం ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ని యూజ్ చేసే కస్టమర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా యూఎస్ లో మాత్రమే. త్వరలోనే భారత్ సహా ఇతర దేశాల్లో లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఐఓఎస్ ట్రూకాలర్ యాప్ లో కూడా ఇదే ఫీచర్ ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి