iDreamPost
android-app
ios-app

పిఠాపురంలో ప‌వ‌న్‌ పై ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి పోటీ

  • Published Apr 10, 2024 | 6:41 PM Updated Updated Apr 10, 2024 | 6:41 PM

ఏపీలో ఎన్నికల వేడి జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పేరు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మరి ఇలాంటి సమయంలో.. ఇప్పుడు ఆ సౌండ్ కు మరింత మోత మోగేలా.. పవన్ పై పోటీగా తాజాగా బిగ్‌ బాస్‌ ఫేమ్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగానున్నారు. అయితే ఇంతకి తమన్నా ఏ పార్టీ తరుపున పోటీ చేయనున్నారో తెలుసుకుందాం.

ఏపీలో ఎన్నికల వేడి జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పేరు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మరి ఇలాంటి సమయంలో.. ఇప్పుడు ఆ సౌండ్ కు మరింత మోత మోగేలా.. పవన్ పై పోటీగా తాజాగా బిగ్‌ బాస్‌ ఫేమ్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగానున్నారు. అయితే ఇంతకి తమన్నా ఏ పార్టీ తరుపున పోటీ చేయనున్నారో తెలుసుకుందాం.

  • Published Apr 10, 2024 | 6:41 PMUpdated Apr 10, 2024 | 6:41 PM
పిఠాపురంలో ప‌వ‌న్‌ పై  ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి పోటీ

ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కోసం అధికార పార్టీలు పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న ఈ పాలిటిక్స్ అనేవి సమ్మార్ హీట్ కంటే.. మరింత హాట్ గా మారాయి. ముఖ్యంగా నేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో హీట్ అనేది తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలోనే మరోవైపు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పేరు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మరి ఇలాంటి సమయంలో.. ఇప్పుడు ఆ సౌండ్ కు మరింత మోత మోగేలా మరో ప్రత్యర్థి బరిలోకి దిగానున్నారు. అయితే ఇప్పటికే పిఠాపురంలో పవన్‌కళ్యాణ్ పై పోటీగా వైసీపీ నుంచి మహిళా నేత బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి సమయంలో.. ఇప్పుడు తాజాగా బిగ్‌ బాస్‌ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీ చేయబోతున్నారు. ఇంతకి తమన్నా ఏ పార్టీ తరుపున పోటీ చేయనున్నారో తెలుసుకుందాం.

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి.. పవన్ పై పోటిగా పిఠాపురం పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికలో బరిలో దిగుతున్నారు. అయితే, తమన్నా.. బోడె రామచంద్రయాదవ్‌ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈమేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించిన 38 మంది జాబితాలో తమన్నా సింహాద్రి పేరు కూడా ఉండడం గమన్హారం. కాగా, తమన్నా ఏపీ ఎన్నికల్లో.. పోటీ చేయడం కొత్తేమీ కాదు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో కూడా తమన్నా సింహాద్రి, మంగళగిరిలో నారా లోకేష్‌పై పోటీ చేసి సంచలనం సృష్టించారు. అయితే నిజానికి, తమన్నా.. గతంలో జనసేన పార్టీలోనే పనిచేశారు. ఈ క్రమంలోనే.. జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో మంగళగిరి సీటు ఆశించారు. కానీ, ఆశించినట్లు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఇక ఆ ఎన్నికల తర్వాత కూడా తమన్నా.. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగానే మాట్లాడారు. కానీ, టీడీపీతో ఎప్పుడైతే జనసేన పొత్తు పెట్టుకున్నదో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌పై తమన్నా తీవ్రంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు ఏకంగా ఆయనకు పోటీకి దిగుతూ మరో సంచలనానికి తెర తీశారు.

అయితే ప్రస్తుతం పిఠాపురం నుంచి పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో.. అందరి ఫోకస్ పిఠాపురం నియోజవర్గం పై పడింది. అందులో ఇప్పుడు పవన్ పై పోటీగా.. తమన్నా సింహాద్రి బరిలోకి దిగుతుండడంతో మరింత జోరుగా చర్చంశనీయంగా మారింది. కాగా, పిఠాపురంలో కాకినాడ ఎంపీ వంగా గీతకు అసెంబ్లీ స్థానం కేటాయించబడింది. ఇక వీరిద్దరి మధ్య ప్రధానంగా జరగబోతున్న ఈ పోటీలో.. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి కూడా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య పోటీ అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి, పవన్ కు పోటీగా బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలయజేయండి.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobet girişjojobet