iDreamPost

Rameshwaram Cafe, NIA: బెంగుళూరు పేలుళ్ల కేసు విచారణలో ట్విస్ట్! APలోని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్!

Rameshwaram Cafe, NIA: మార్చి1వ తేదీన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో జరిగిన పేలుడు దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. రామేశ్వరం కేఫ్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటన విషయంలో ఎన్ఐఏ అధికారులు కీలక విషయం వెల్లడించారు.

Rameshwaram Cafe, NIA: మార్చి1వ తేదీన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో జరిగిన పేలుడు దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. రామేశ్వరం కేఫ్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటన విషయంలో ఎన్ఐఏ అధికారులు కీలక విషయం వెల్లడించారు.

Rameshwaram Cafe, NIA: బెంగుళూరు పేలుళ్ల కేసు విచారణలో ట్విస్ట్! APలోని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్!

కర్నాటక రాష్ట్రం రాజధాని బెంగుళురూ నగరంలో రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో ఈ కేఫ్ లో  పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇక రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా సంచనం సృష్టించింది.  ప్లాన్ ప్రకారమే పేలుళ్లకు పాల్పడ్డారని తేలడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. రామేశ్వరం కేఫ్ ఘటనలో ఇప్పటికే ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పక్కా పథకం ప్రకారం పేలుడుకి పాల్పపడినట్లు అధికారులు తెలిపారు. తాజాగా రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఏపీకి వచ్చారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

2024 మార్చి1వ తేదీన బెంగుళూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్ లో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 10 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనేక పలు కేసులను పోలీసులు అధికారులు, ఎన్ఐఏ అధికారులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు కీలక అంశాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రామేశ్వరం కేఫ్ ను కేసును చేధిస్తున్న ఎన్ఐఎ.. తాజాగా కేసు విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాయదుర్గానికి రావడం సంచలనంగా మారింది.

ఎన్ఐఏ అధికారులు మంగళవారం తెల్లవారుజామున రాయదుర్గంలోని వేణుగోపాలస్వామి గుడి వీధిలో ఉండే రిటైర్డ్ టీచర్ అబ్దుల్లా ఇంట్లో సోదాలు నిర్వహించారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ గా ఆయన కుమారుడు సోహెల్ పని చేస్తున్నాడు. సోహెల్ ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. సోహెల్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో ఎన్ఐఎ అధికారులు రాయదుర్గంలోని వారి ఇంట్లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. సోహెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించిన అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోహెల్ బెంగళూరులో ఉండి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఆయన ఫోన్ ను ఉపయోగించినట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానులు వ్యక్తం చేశారని తెలుస్తోంది.

బెంగుళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులను పశ్చిమ బెంగాల్ లో  అరెస్టు చేశారు. ప్రస్తుతం రామేశ్వరం కేఫ్ కేసుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన గురించి చూసినట్లు అయితే.. తొలుత సిలిండర్ పేలినట్లు అందరు భావించారు. అయితే అక్కడి  సీసీటీవీ ఫుటేజ్ చూడటంతో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇది సిలిండర్ పేలుడు కాదని.. పక్కా పథకం ప్రకారం జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ  రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పేలుడు వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి