iDreamPost

భార్యని అడ్డుగా పెట్టి డబ్బు సంపాదించాలి అనుకున్నాడు! ఆమె మాత్రం!

నాలుగు నెలల క్రితం కూతురికి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపాను డెల్నా తల్లిదండ్రులు. హాయిగా కాపురం సాగిపోతుందని ఆనందంలో మునిగిపోయింది ఆమె. కానీ ఆమెను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు భర్త.

నాలుగు నెలల క్రితం కూతురికి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపాను డెల్నా తల్లిదండ్రులు. హాయిగా కాపురం సాగిపోతుందని ఆనందంలో మునిగిపోయింది ఆమె. కానీ ఆమెను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు భర్త.

భార్యని అడ్డుగా పెట్టి డబ్బు సంపాదించాలి అనుకున్నాడు! ఆమె మాత్రం!

ఆడ పిల్ల పుడితే.. మహాలక్ష్మి పుడుతుందని సంబరపడిపోతున్నారు తల్లిదండ్రులు. వారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అమ్మాయి కోరిన కోర్కెలు తీర్చుతున్నారు. తాను ఎంత వరకు చదువుకుంటానంటే అంత చదివిస్తున్నారు. 25 ఏళ్లు రాగానే.. ఓ అయ్య చేతిలో పెట్టి అత్తారింటికి సాగనంపుతున్నారు. పిల్లనిచ్చిన చోట అమ్మాయికి ఎలాంటి లోటు రాకూడదని భావించి.. పెట్టి పోతలు చేసి తమ కుందనపు బొమ్మను , తమ కంటి పాపను వారికి అందిస్తున్నారు. కానీ ఇంటికి వచ్చిన కోడల్ని కూతురిలా చూడాల్సిన అత్తమామలు..ఆమెను నడిచే బ్యాంకులా చూస్తున్నారు. మరింత క ట్నం తీసుకురావాలంటూ హింసకు గురి చేస్తున్నారు. దీనికి కట్టుకున్న భర్త కూడా వంత పాడుతున్నాడు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక సతమతమౌతున్నారు.

పెళ్లై నాలుగు నెలలు అయ్యిందో లేదో.. పుట్టింటి నుండి డబ్బులు తీసుకురా, బంగారం తెస్తావా లేదా అంటూ కోడల్ని హింసించడం మొదలు పెట్టారు అత్తింటి వారు. దీంతో తల్లిదండ్రుల్ని అడగలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో చోటుచేసుకుంి. వివరాల్లోకి వెళితే.. చోనోకుండ్‌కు చెందిన పుతన్‌పురా బినోయ్ కుమార్తె డెల్నాకు సనూప్ ఆంటోనీ అనే వ్యక్తితో వివాహం చేశారు. పెళ్లైన నాటి నుండి డబ్బులు తీసుకు రావాలని, 80 సవర్ల బంగారం పుట్టింటికి వెళ్లి తీసుకురావాలని హింసకు గురి చేశారు. భార్యను అడ్డుపెట్టుకుని ఆమె పుట్టింటి నుండి డబ్బులు లాగాలనుకున్నారు.  మానసికంగా కుంగిపోయిన డెల్నా విషయం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం మృతి చెందింది.

కాగా, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు డెల్నా తల్లిదండ్రులు. ఆ సమయంలో బాధితురాలి నుండి వాంగ్మూలాన్ని సేకరించారు. పుట్టింటి నుండి డబ్బులు, బంగారం తీసుకురావాలంటూ అత్త, భర్త హింసించారని ఆమె వాంగ్మూలం ఇచ్చింది. అయితే డెల్నా ఆసుపత్రిలో చేరిన నాటి నుండి తల్లీ, కొడుకులు పరారయ్యారు. వీరిని అలకోడ్ పోలీసులు పరియారంలోని కలంతిపరం వద్ద అరెస్టు చేశారు. గృహ హింస, వరకట్న వేధింపుల పేరుతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా, భర్త సనూప్, అత్త సోలి ఆంటోనీకి స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఇద్దరు బెయిల్ పై బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ, కూతుర్ని పొగొట్టుకుని డెల్నా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. పెళ్లై నాలుగు నెలలకే నూరేళ్లు నిండిపోయాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేస్తే..ఇలా తమ బిడ్డను అప్పగించారని ఆవేదన చెందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి