iDreamPost
android-app
ios-app

ఆ హీరో ఫ్యాన్స్ కి శ్రీలీల నచ్చట్లేదా..? వద్దని వారిస్తున్నారట!

  • Author ajaykrishna Published - 03:28 PM, Tue - 26 September 23
  • Author ajaykrishna Published - 03:28 PM, Tue - 26 September 23
ఆ హీరో ఫ్యాన్స్ కి శ్రీలీల నచ్చట్లేదా..? వద్దని వారిస్తున్నారట!

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి మించి ఒకటి సినిమాలు చేసుకుంటూ.. వరుసగా దాదాపు డజనుకు పైగా సినిమాలు లైనప్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటిదాకా శ్రీలీల తెలుగులో చేసింది రెండు సినిమాలే.. పెళ్లి సందడి, ధమాకా.. ఈ రెండే విడుదల అయ్యాయి. కానీ.. స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే.. ఓవైపు సినీ కెరీర్ ని చూసుకుంటూనే, మరోవైపు తన ఎడ్యుకేషన్ పై కూడా దృష్టి పెడుతోంది అమ్మడు. అందుకే.. తాను ముందుగా అనుకున్నట్లుగా ఎడ్యుకేషన్ కి ఓ నెల రెండు నెలలు ఎగ్జామ్స్ అయ్యేవరకు షూటింగ్స్ కి రాలేనని చెప్పేసిందట.

ఇక శ్రీలీల చేస్తున్న సినిమాలలో ప్రస్తుతం రామ్ తో చేసిన స్కంద, వైష్ణవ్ తో ఆదికేశవ.. బాలయ్యతో భగవంత్ కేసరి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కాగా.. ఇవే కాకుండా శ్రీలీల నుండి వరుసగా నెలకో సినిమా చొప్పున రిలీజ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే.. కొన్ని షూటింగ్స్ కంప్లీట్ చేసుకోగా.. మరికొన్ని సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉన్నాయట. అయితే.. సెట్స్ పైకి వెళ్లే సినిమాలను మెల్లగా రిజెక్ట్ చేస్తోందట ఈ భామ. ఎందుకంటే.. ప్రస్తుతం తాను ముందుగా ఓకే చేసిన సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసే క్రమంలో.. కొత్తగా ఒప్పుకుంటున్న సినిమాలకు డేట్స్ ఇవ్వలేక సున్నితంగా తిరస్కరిస్తుందట.

అలా రీసెంట్ గా విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ మూవీ, రవితేజతో ఓ మూవీ వదులుకుందని టాక్ వినిపిస్తుంది. విజయ్ దేవరకొండతో ఏకంగా పూజా కార్యక్రమం కూడా జరిగింది. మరి కారణాలు ఏవైనా ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. తమ హీరోకు శ్రీలీల లేకపోయినా పర్వాలేదని.. వేరే ఉందని అంటున్నారట విజయ్ ఫ్యాన్స్. ఇంతకీ.. ఆ వేరే హీరోయిన్ ఎవరంటే.. రష్మిక మందన. విజయ్ రష్మిక కాంబినేషన్ లో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చాయి. చాలా కాలంగా వీరి కాంబోలో మరో మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో.. ఇప్పుడు ప్రాజెక్ట్ నుండి శ్రీలీల తప్పుకుందని తెలిసి.. మాకేం బాధ లేదని, రష్మిక ఉందని.. ఆమెను ఓకే చేయాలని కోరుతున్నారట ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి విజయ్, శ్రీలీల కాంబినేషన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş