iDreamPost
android-app
ios-app

ద్యావుడా.. రోహన్ రాయ్ రెమ్యునరేషన్ అన్ని లక్షలా?

Child Artis Rohan Roy Remuneration: #90's వెబ్ సిరీస్ ఫేమ్ రోహన్ రాయ్ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు రోహన్ రాయ్ రెమ్యూనరేషన్ వివరాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరి.. మనోడి పారితోషకం ఎన్ని లక్షలో చూడండి.

Child Artis Rohan Roy Remuneration: #90's వెబ్ సిరీస్ ఫేమ్ రోహన్ రాయ్ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు రోహన్ రాయ్ రెమ్యూనరేషన్ వివరాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరి.. మనోడి పారితోషకం ఎన్ని లక్షలో చూడండి.

ద్యావుడా.. రోహన్ రాయ్ రెమ్యునరేషన్ అన్ని లక్షలా?

టాలీవుడ్ లో అవకాశాలు రావడం కష్టం అంటారు. కానీ, అవకాశం వచ్చినా కూడా దానిని సరిగ్గా వాడుకోవడం కూడా రావాలి. టాలెంటు ఉంటే సరిపోదు దానిని సరైన సమయంలో సరైన విధంగా ప్రదర్శించగలగాలి. ఇవన్నీ సరిగ్గా ఫాలో అయిన టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ ఇప్పుడు మినీ సెలబ్రిటీ అయిపోయాడు. వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన రోహన్ రాయ్ ఆ తర్వాత అటు టాలీవుడ్ లో ఇటు వెబ్ సిరీసుల్లో గట్టిగానే ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా #90’s వెబ్ సిరీస్ లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మనోడి క్రేజ్ ఎంత పెరిగింది అంటే.. ఇప్పుడు రోహన్ రాయ్ రెమ్యూనరేషన్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది.

రోహన్ రాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. 90’s వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత రోహన్ రాయ్ కి డిమాండ్ బాగా పెరిగింది అనే చెప్పాలి. ముఖ్యంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనగానే రోహన్ రాయ్ ఎక్స్ ప్రెషనే గుర్తొస్తుంది. పైగా ఇటీవల మమ్ముట్టి చిత్రంలో కూడా మెరిశాడు. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని రోహన్ బాగా వినియోగించుకుంటున్నాడు. ఇవేగాక ప్రమోషన్స్ లో కూడా రోహన్ రాయ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఉంటాడు. అందుకే అవకాశాలు కూడా మనోడికి అలాగే వస్తున్నాయి.

ఇప్పుడు రోహన్ రాయ్ రెమ్యూనరేషన్ వివరాలు బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆ అంకె విన్న తర్వాత ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మనోడు ఇప్పుడు ప్రాజెక్ట్ లెక్క కాకుండా రోజుల లెక్క రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంట. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. రోజుకు రూ.30 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నాడంట. అంటే ఎన్నిరోజులు షూటింగ్ ఉంటే అన్ని రోజులు.. నిర్మాత రోజుకు రూ.30 వేలు ఇవ్వాలి. పైగా రోహన్ రాయ్ ఫ్యామిలీ బెంగళూరులో సెటిల్ అయ్యింది కాబట్టి.. రానుపోనూ ఫ్లైట్ ఛార్జెస్, హోటల్ స్టే యాడాన్ అనమాట. ఇలా చూసుకుంటే.. రోహన్ రాయ్ కి రోజుకు ఖర్చు రూ.40 నుంచి 50 వేలు అవుతుంది.

ఒక చిన్న రోల్ వచ్చినా కూడా దానిని షూట్ చేయాలి అంటే నెల రోజులు అయినా పడుతుంది. ఒకవేళ ఫుల్ లెంగ్త్ రోల్ వచ్చిందంటే.. 60 రోజులు షూటింగ్ ఉంది అనుకుందాం. అప్పుడు 60 రోజులకు రూ.30 వేలు చొప్పున వేసుకుంటే.. రోహన్ రాయ్ కి రెమ్యూనరేషన్ కింద రూ.18 లక్షలు ఇవ్వాలి. ట్రావెలింగ్, స్టే ఖర్చులు అదనం. ఇలా చూసుకుంటే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గట్టిగానే సంపాదిస్తున్నాడు. అయితే ఎవరికీ ఏదీ ఊరికే ఇచ్చేయరు అనే విషయాన్ని మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి. రోహన్ రాయ్ కి అంత ఇచ్చి అవకాశాలు ఇస్తున్నారు అంటే అది అతని టాలెంట్ అనే చెప్పాలి. 90’s సిరీస్లో కూడా రోహన్ కు ఊరికే అవకాశం రాలేదు. ఆడిషన్స్ పెట్టి.. ఆ రోల్ అతనికి సెట్ అవుతుందని నమ్మిన తర్వాతే ఇచ్చారు. కాబట్టి ఎన్ని లక్షలు తీసుకున్నా అది అతని టాలెంట్ ని బట్టే వస్తోంది. పైగా మనోడికి మిమిక్రీ, ఇమిటేషన్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. మరి.. సుద్దపూస బుడ్డోడు రోహన్ రాయ్ రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.