iDreamPost

రంజాన్ నాడు స్టార్ హీరోయిన్ సూపర్ లుక్! ఈమె ముస్లీమ్ అని చాలా మందికి తెలియదు!

రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతి ముస్లిం సోదరీ సోదరీమణులు వేడుక చేసుకుంటున్నారు. ఇదిగో ఇప్పుడు ఓ నటి కూడా ఈ పండుగను పురస్కరించుకుని స్పెషల్ అవుట్ ఫిట్ ధరించి మెస్మరైజ్ చేస్తుంది. చాలా మందికి ఆమె ముస్లిమ్ అని తెలియదు.

రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతి ముస్లిం సోదరీ సోదరీమణులు వేడుక చేసుకుంటున్నారు. ఇదిగో ఇప్పుడు ఓ నటి కూడా ఈ పండుగను పురస్కరించుకుని స్పెషల్ అవుట్ ఫిట్ ధరించి మెస్మరైజ్ చేస్తుంది. చాలా మందికి ఆమె ముస్లిమ్ అని తెలియదు.

రంజాన్ నాడు స్టార్ హీరోయిన్ సూపర్ లుక్! ఈమె ముస్లీమ్ అని చాలా మందికి తెలియదు!

దక్షిణాది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసి.. ఇప్పుడు బాలీవుడ్‌ను షేక్ చేసేసేందుకు సిద్ధమైంది ఆ నటి. రావణ్, చెన్నై ఎక్స్ ప్రెస్(స్పెషల్ సాంగ్), ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. గత ఏడాది బాలీవుడ్ కింగ్ ఖాన్, అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ సినిమాలో కీ రోల్ ప్లే చేసి అదరగొట్టింది. వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉంది భామ. మలయాళంలో వచ్చిన నేరు, తెలుగు ఓటీటీ మూవీ భామాకలాపం 2, హిందీ మూవీ ఆర్టికల్ 370 చిత్రాలు ఆమెకు మరింత క్రేజ్ తెచ్చాయి. తాజాగా అజయ్ దేవగన్ సరసన మైదాన్ చిత్రంలో నటించింది. ఏప్రిల్ 10 నుండి థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఓ స్పెషల్ ఎటైర్‌తో మెస్మరైజ్ చేస్తుంది భామ. ఇంతకు ఆమె ఎవరో తెలిసింది కదా..  ఆ బ్యూటీనే ప్రియమణి.

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అచ్చమైన ముస్లిం మహిళలా మారిపోయింది. గ్రీన్ గాగ్రా చోళీని ధరించి..ముంతాజ్ జ్యూయలరీతో మతి పోగొట్టేస్తుంది. ఈ ఫోటోలను షేర్ చేసిన ప్రియమణి.. ఈద్ ముబారక్ తెలిపింది. దీనిపై మీరు చాలా అందంగా ఉన్నారని, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. అయితే జై శ్రీరామ్ అంటూ కొంత మంది రాసుకొస్తున్నారు. నవరాత్రికి కూడా ఏం పోస్టు చేయలేదంటూ కామెంట్స్  చేస్తున్నారు. నిజాలు తెలుసుకోకుండా ఆమెను నెటిజన్లు ఇలాంటి తిక్క ప్రశ్నలు వేస్తున్నారు. వాస్తవానికి ఆమె అయ్యంగార్ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఇది కేరళలో బ్రాహ్మణ వర్గం కిందకు వస్తుంది. కేరళలోని అయ్యర్ తల్లిదండ్రులకు బెంగళూరులో జన్మించింది.

చదువు ముగించాక ఎవరే అతగాడు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి పెళ్లైన కొత్తలో మూవీతో హిట్ అందుకుంది. అటు తమిళంలో కూడా అడుగుపెట్టి..పరుత్తి వీరన్ మూవీతో జాతీయ అవార్డును గెలుచుకుంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో పేర్లర్‪గా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. యమదొంగ, నవ వసంతం, హరే రామ్, ద్రోణ, మిత్రుడు, ప్రవరాఖ్యుడు, సాధ్యం, గోలీమార్, రక్త చరిత్ర, రగడ, రాజ్, క్షేత్రం, చండీ, నారప్ప, భామా కలాపం వంటి చిత్రాలు చేసింది. అయితే ఆమె 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని మనువాడింది. అతడు ముస్లిం మతస్తుడు. అప్పటి నుండి భర్తకు తగ్గ భార్యగా అతడి అడుగు జాడల్లో నడుస్తోంది. మతం స్వీకరించనప్పటికీ.. ఆ మతానికి గౌరవం ఇస్తూ.. రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంది. అలా ఆ మతానికి కూడా ఈక్వెల్ రెస్పెక్ట్ ఇస్తూ.. వారి పండుగల్లో భాగస్వామ్యం అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Priya Mani Raj (@pillumani)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి