iDreamPost

ఆ స్టార్ హీరో.. నా మూవీలో ఛాన్స్ ఇచ్చాగా నాకేంటి అన్నాడు: అర్చన

Archana On Star Hero: టాలీవుడ్ నటి అర్చనకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో మంచి సినిమాలు కూడా చేసింది. అయితే అర్చనకు ఒకసారి స్టార్ హీరో నుంచి ఊహించిన పరిస్థితి ఎదురైనట్లు చెప్పుకొచ్చింది.

Archana On Star Hero: టాలీవుడ్ నటి అర్చనకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో మంచి సినిమాలు కూడా చేసింది. అయితే అర్చనకు ఒకసారి స్టార్ హీరో నుంచి ఊహించిన పరిస్థితి ఎదురైనట్లు చెప్పుకొచ్చింది.

ఆ స్టార్ హీరో.. నా మూవీలో ఛాన్స్ ఇచ్చాగా నాకేంటి అన్నాడు: అర్చన

టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు పాన్ ఇండియా లెవల్లో ఎన్నో ఇండస్ట్రీలపై కొన్ని ఆరోపణలు, మచ్చలు పడ్డాయి. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అని, మీటూ అనే విప్లవాలు కూడా నడిచాయి. చాలా మంది ఆర్టిస్ట్స్ స్వయంగా బయటకు వచ్చి తమకు ఎదురైన అవమానాలు, ఇబ్బందికర పరిస్థితుల గురించి ఎన్నో ఆరోపణలు చేశారు. అలాగే స్టార్ హీరోలు కూడా తమకు కెరీర్ స్టార్టింగ్ ఎదురైన కొన్ని చెప్పుకోలేని పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇలాంటి జాబితాలోకి తెలుగు నటి అర్చన కూడా చేరింది. ఆమె తనకు ఒక స్టార్ హీరో దగ్గర ఎదురైన ఊహించని ఘటన గురించి ఇంటర్వ్యూలో ఓపెన్ కామెంట్స్ చేసింది. ఏ ఇండస్ట్రీ అటి పరిస్థితులు ఉంటాయని చెప్పుకొచ్చింది.

నటి అర్చనకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కల్చరల్ డాన్సర్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఈమెకు తెలుగులో మంచి అవకాశాలు దక్కాయి. వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుని మంచి నటిగా ఎదిగింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన అర్చన ఆ తర్వాత వేరే వేరే ఇండస్ట్రీల్లో కూడా పని చేసింది. కానీ, తెలుగు మాతృభాష కాబట్టి టాలీవుడ్ లో వర్క్ చేసేందుకు ఎక్కువ మక్కువ చూపించేది. అయితే టాలీవుడ్ లో అవకాశాలు మాత్రమే కాదు.. అనుకోని సంఘటనలు కూడా ఎదురైన విషయాన్ని అర్చన అంగీకరించింది. ఒక స్టార్ హీరో దగ్గరి నుంచి అవకాశం ఇచ్చినందుకు ఫేవర్ అడిగారని ప్రశ్నించగా.. అర్చన అందుకు అంగీకరించింది.

Archana

ఆ ఘటన గురించి మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఉండే పరిస్థితుల గురించి కూడా అర్చన కీలక వ్యాఖ్యలు చేసింది. “ఈ ఇండస్ట్రీ అనే కాదు.. అన్ని చోట్ల కొంతమంది పనికి రాని వేస్ట్ ఉచిత సలహాలు ఇస్తారు. దాని వల్ల అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతాయి. అలాంటి పరిస్థితి నాకు రాకుండా ఉండటానికి కారణం నా కుటుంబం. మన ఇండస్ట్రీలో అర్చనకు ఛాన్స్ ఇవ్వడానికి ఉన్న బ్యానర్లకు బిగ్ డీల్ కాదు. కానీ, మనకు ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు నేను ఇగ్నోర్ చేస్తాను. నేను జస్ట్ నవ్వేసి వెళ్లిపోతాను. నాకు అలాంటి సిట్చువేషన్స్ లో నా బ్రెయిన్ బాగా పని చేస్తుంది. నేను చాలా అమాయకంగా నటిస్తాను. చాలా తెలివిగా సమాధానం చెప్తాను.

స్టార్ హీరో అలా అన్నప్పుడు మీకు ఇచ్చేంత దానిని కాదు సార్ నేను అంటూ పక్కకు వెళ్లి పోయాను. ఆయనకు ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇలా అనేసింది అనుకున్నారు. అంత పెద్ద మనిషి అలా అనడం చాలా ఫన్నీగా అనిపిచింది. అది నిజానికి చాలా పెద్ద విషయం. అయితే ఆ సినిమాలో నా పాత్రను బాగా కట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ వల్లే నా పాత్రను బాగా కట్ చేశారు. వాళ్ల దగ్గరి నుంచి ఇంక వర్క్ ఎక్స్ పెక్ట్ చేయలేము. అదే విషయాన్ని నేను సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఉంటే అది వాళ్ల ఈగోని హర్ట్ చేసినట్లు అవుతుంది. నేను చాలా పొలైట్ గా చెప్పాను. అంత చిన్న ఏజ్ లో అంత బాగా ఎలా చెప్పగలిగాను అని నేను కూడా షాకయ్యాను. నా రోల్ కట్ చేయడంపై మనం ఏమీ చేయలేం. మనం ఏమీ చేయలేం. అతను అడిగింది మనం ఎలాగూ చేయలేం. అందుకే జస్ట్ నవ్వేసి ఊరుకున్నాను. అలాంటి వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను” అంటూ అర్చన చెప్పుకొచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి