P Krishna
America Crime News: ఈ మధ్య సెలబ్రెటీలు ఇండస్ట్రీలో బిజీగా లేకపోయినా.. సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటున్నారు. తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేసిన ఓ ఫోటో మోడల్, నటి కొంప ముంచింది.
America Crime News: ఈ మధ్య సెలబ్రెటీలు ఇండస్ట్రీలో బిజీగా లేకపోయినా.. సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటున్నారు. తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేసిన ఓ ఫోటో మోడల్, నటి కొంప ముంచింది.
P Krishna
ఇటీవల సెలబ్రెటీలు తమ అభిమానులతో సోషల్ మాధ్యమాల ద్వారా బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రయాణాలు, జిమ్, రెస్టారెంట్ సందర్శనల సమయంలో ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లకు విపరీతమైన లెక్స్, షేర్లు వస్తున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఈ పోస్టులు వివాదాలకు దారితీస్తున్నాయి.. పోస్టులపై విపరీతమైన ట్రోలింగ్స్ కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు సీక్రెట్ గా ఉండే ఫోటోలు అనుకోకుండా రివీల్ కావడం వల్ల సెలబ్రెటీలు నానా తంటాలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. తాజాగా మోడల్ కమ్ నటి ఒక రెస్టారెంట్‌కి వెళ్లి సీఫుడ్ తింటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.ఆ తర్వాత దారుణం జరిగింది. ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బికినీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మోడల్ కమ్ నటి లాండీ పర్రాగా గోయ్‌బు మరణం తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు దుండగులు ఆమెను తుపాకీతో దారుణంగా కాల్చి చంపారు.ఆమె చేసిన ఒక చిన్న పొరపాటు ఆమె మరణానాకి కారణం అంటున్నారు. పర్రాగా గోయ్‌బు చనిపోయే ముందు ఒక రెస్టారెంట్ లో సీ ఫుడ్ తింటున్నా అంటూ ఒక ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. ఆ లోకేషన్ ఆధారంగా ఇద్దరు దుండుగులు అక్కడికి చేరుకొని ఆమెపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే పర్రాగా గోయ్‌బు హత్య వెనుక ఓ డ్రగ్ డీలర్ హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెస్టారెంట్ లో ఓ వ్యక్తితో పర్రాగా గోయ్‌బు మాట్లాడుతున్న సమయంలో దుండగులు రెస్టారెంట్‌లోకి ప్రవేశించారు. ఒక్కసారిగా లాండీ పర్రాగా గోయ్‌బు పై బుల్లెట్ల వర్షం కురిపించారు.
లాండీ శరీరంలో కాల్పులు జరపడంతో నేలపై కుప్పకూలి మరణించింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఈ హత్యకు గల కారణం పర్రాగా గోయ్‌బు ఓ డ్రగ్ డీలర్ తో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. గత ఏడాది అతడు జైల్లో జరిగిన గొడవల కారణంగా చనిపోయాడు. గతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లాండీ పేరు కూడా వినిపించింది. డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మాజీ ప్రియుడితో విభేదించిన లాండీని కాల్చి చంపింది ఎవరు అనే కోణంలో విచారణ జరుగుతోంది. లాండి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.73 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏప్రిల్ 28 న ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు క్వెవెడో నగరానికి వచ్చిన లాండీ పర్రాగా ఇలా హత్యకు గురి కావడం సంచలనం రేపింది.