iDreamPost

ఘోర ప్రమాదం..ఎన్నికల సిబ్బంది బస్సు బోల్తా.. 21 మంది!

శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తొలిదశ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలను ముగించుకుని తిరిగి బయలుదేరిన ఎన్నికల సిబ్బంది వాహనం ప్రమాాదానికి గురైంది. ఈఘటనలో 21 మంది...

శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తొలిదశ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలను ముగించుకుని తిరిగి బయలుదేరిన ఎన్నికల సిబ్బంది వాహనం ప్రమాాదానికి గురైంది. ఈఘటనలో 21 మంది...

ఘోర ప్రమాదం..ఎన్నికల సిబ్బంది బస్సు బోల్తా.. 21 మంది!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ రోడ్డ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రంగా గాయపడుతున్నారు. తాజాగా  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.  ఎన్నికల విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా బస్సు బోల్తా పడింది. ఇక పూర్త వివరాల్లోకి వెళ్తే..

శుక్రవారం  సార్వత్రిక ఎన్నికల తొలి దశ పొలింగ్ జరిగింది.  21 రాష్ట్రాల్లో మొదటి దశ పొలింగ్ జరిగింది. చిన్న చిన్న సమస్యల మినహా  ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అలానే తొలిదశ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఉంది. ఇక్కడ లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ముగిసింది. విధులు ముగించుకుని తరిగి వెళ్తున్న సిబ్బంది ప్రమాదం బారిన పడిన ఉదంతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారాలో ఎన్నికల విధులు ముగించుకుని జవాన్లు, పోలీసులు తిరిగి వెళ్తున్నారు. చింద్వారా  నుంచి రాజ్‌గఢ్‌కు తిరిగి వెళ్తున్న వీళ్ల బస్సు  బేతుల్‌లోని బరేతా ఘాట్ సమీపంలోకి రాగానే బోల్తా పడింది.

ఇక స్థానిక మీడియా అందించిన సమాచారం ప్రకారం.. బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది జవాన్లు గాయపడ్డారు. అలానే వారిలోని తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానిక  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బరేతా ఘాట్‌లోని అర్జున్ గోండి జోడ్ కల్వర్టు సమీపంలో  ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు  ఎదురుగా వస్తున్న ఒక ట్రక్కును ఢీకొని బోల్తా పడిందని స్థానిక పోలీసులు తెలిపారు. బస్సు చింద్వారా నుండి రాజ్‌గఢ్‌కు రాత్రి ఒంటిగంటకు బయలుదేరిందని సైనికులు తెలిపారు.

ఇక ఈ ప్రమాదంపై సమచారం అందుకున్న షాపూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను షాపూర్, బేతుల ఆస్పత్రులకు తరలించారు. ఇక ఈఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సింది.  ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఓ కారు అతివేగంతో బైక్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఈఘటనలో కారులోని ఐదుగురు, బైక్ పై ఉండే వ్యక్తి కూడా మరణించాడు.  ఇలాంటి ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి