సౌత్ ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం అయ్యిందో అందరికీ తెలుసు. ఆమె లివ్ ఇన్ పార్టనర్ శ్రద్ధా వాకర్ ను హత్య చేశాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి రంపం, 3 బ్లేడ్లు, సుత్తి, ప్లాస్టిక్ కవర్లు కొనుక్కొచ్చాడు. ఆ తర్వత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి కొద్దిగా కొద్దిగా డిస్పోస్ చేశాడు. మళ్లీ అలాంటి ఒక హత్య కేసు ఇప్పుడు ఘటన ఇప్పుడు నార్త్ ఢిల్లీలో వెలుగు చూసింది. రెండు కవర్లలో శరీర భాగాలు దొరికాయి.
ఈ ఘోరం నార్త్ ఢిల్లీ గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్లాస్టిక్ కవర్లు దొరికాయి. వాటిలో ఒక కవర్ లో తల, రెండో కవర్లో మిగిలిన బాడీ ఉంది. అయితే తలకు ఉన్న బారు వెంట్రుకల ఆధారంగా పోలీసులు మృతదేహం మహిళది అయి ఉంటుందని భావిస్తున్నారు. వయసు 36 నుంచి 40 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ మరిన్ని ఆధారాల కోసం వెతుకుతున్నారు. అయితే మృతదేహం ఎవరు అనేది మాత్రం ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనపై సీపీ, డీసీపీ మీడియాతో మాట్లాడారు.
“ప్లాస్టిక్ కవర్లలో దొరికింది మహిళ మృతదేహంగా భావిస్తున్నాం. వయసు 40 ఏళ్లలోపు ఉండచ్చు. మరణించింది ఎవరు అనేది ఇంకా గుర్తించలేదు. క్లూస్ టీమ్ మరిన్ని ఆధారాల కోసం ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మెడికల్ టీమ్ ఐడెంటెఫై చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది” అంటూ సీపీ పరమాధిత్య వెల్లడించారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మరిన్ని ఆధారాలు, నిందితుల కోసం పోలీసులు గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు.
అయితే ఈ హత్య ఎందుకు జరిగింది. ఆ మృతదేహం ఎవరిది. ఎవరు హత్య చేశారు వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే నార్త్ ఢిల్లీలో ఇలా ఓ మహిళ మృతదేహం దొరకడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత అతి కిరాతకంగా తలను, మొండాన్ని వేరు చేసి.. ప్లాస్టిక్ కవర్లలో పెట్టి అటవీ ప్రాంతంలో పారేశారని తెలుసుకుని భయాందోళనకు గురవుతున్నారు. ఈ కేసును త్వరగా ఛేదించి.. నిందితులను అరెస్టు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెట్టింటి ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
VIDEO | Delhi Police recovered chopped up body of a woman near Geeta Colony flyover earlier today. More details are awaited. pic.twitter.com/muMRgoaxzI
— Press Trust of India (@PTI_News) July 12, 2023