iDreamPost

భర్త కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన భార్యలు..

భర్త కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన భార్యలు..

రైతు అంటే వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టేవారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సదుపాయాలు కల్పించినా కూడా వారి పరిస్థితి మారడంలేదు. ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. వ్యవసాయాని చేసేందుకు అప్పులు చేసి.. ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే పొలం దున్నించేందుకు స్థోమత లేక, ఎద్దులకు, ట్రాక్టర్లకు కిరాయి  ఇవ్వలేని పరిస్థితిలో కొందరు రైతులు ఉన్నారు. ఇక తమ భర్త బాధ చూడలేక ఇద్దరు భార్యలు కాడి మెడలపై పెట్టుకుని ఎద్దుల్లా మారి పొలంలో కలుపు తీశారు. ఈ దృశ్యం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. రైతుల కోసం ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు చేసిన ఇటువంటి దృశ్యాలు గ్రామాల్లో అక్కడ దర్శనమిస్తాయి.

రైతుల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. రోజు రోజుకూ సాగు ఖర్చు భారంగా మారుతోంది. దీంతో పేద రైతులు రెక్కల కష్టాన్నే సాగు వ్యయంగా చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బొమ్మనచెరువు చెందిన రామకృష్ణ నాయక్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు లక్ష్మీదేవి, చిన్నమునెమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవలే రామకృష్ణనాయక్‌ ఎకరం పొలంలో టమాటా సాగు చేపట్టాడు. కలుపు తీతకు కూలీల ఖర్చులు భారంగా మారాయి. దీంతో పలుగు లాగేందుకు ఎద్దులు కొనలేక ఇద్దరు భార్యలు లక్ష్మీదేవి, చిన్నమునెమ్మలను కాడెద్దులుగా మారారు.

వ్యవసాయంలో భర్త పడుతున్న కష్టానికి వారు తోడుగా ఉన్నారు. ఆ ఇద్దరు పలుగు లాగుతూ కలుపుతీతలో నిమగ్నమయ్యారు. సాయంత్రానికి కలుపుతీత పూర్తి చేసి కూలీల ఖర్చు తగ్గించుకున్నానని రైతు రామకృష్ణ నాయక్ తెలిపాడు. ఈ సీన్ చూసినవారి మనసును కలిచివేసింది. కూలీల కొరతతో భార్యలను పొలం పనులకు తీసుకువచ్చాడు ఈ రైతు. ఇటువంటి పరిస్థితులను కూడా రైతులు ఎదుర్కొని పంటను పండిస్తారు. పండిన పంట ఇంటికి చేరే లోపే ప్రకృతి కన్నెర్ర జేసి ఏ గాలివానో, వడగండ్ల వానో దాడి చేస్తుంది. ఆరుగాలం కష్టపడే రైతుకు మిగిలేవి కడగండ్లే. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.

ఇదీ చదవండి:  ఎంత కష్టం వచ్చింది తల్లి.. కుమారుడికి అమ్మ అంత్యక్రియలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి