iDreamPost

ఎంత కష్టం వచ్చింది తల్లి.. కుమారుడికి అమ్మ అంత్యక్రియలు!

ఎంత కష్టం వచ్చింది తల్లి.. కుమారుడికి అమ్మ అంత్యక్రియలు!

ఏ తల్లికైనా తన బిడ్డలే ప్రపంచం. అందుకే బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చిన తల్లి విలవిల్లాడిపోతుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తుంది. తమకు వృద్ధాప్యంలో బిడ్డలు ఆసరాగా ఉంటారని తల్లి భావిస్తుంది. తాను చనిపోతే.. కొడుకు తల కొరివి పెట్టాలని కోరుకుంటుంది. అలాంది.. బిడ్డకే ఆ తల్లి తలకొరివి పెడితే.. బాధను వర్ణించగలమా? తాజాగా, ఏ తల్లికి రాకూడని శోకం ఓ మహిళకు వచ్చింది. కుమారుడు చనిపోతే ఆమే స్వయంగా తల కొరివి పెట్టాల్సి వచ్చింది. అందులోనూ వృద్ధాప్యంతో బాధ పడుతున్న ఆ తల్లి.. కొడుకు తలకొరవి పెట్టిన దృశ్యాలు  అందరిని కంటతడి పెట్టించాయి. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్ జిల్లా మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామానికి చెందిన పామర్తి ప్రసాద్(52), లలిత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  భార్య, పిల్లలు, తల్లి ఝాన్సీతో కలిసి ప్రసాద్ నివసిస్తున్నాడు. అతను కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం  సాయంత్ర మరణించాడు.  దీంతో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. తనను కాటికి సాగనంపాల్సిన కుమారుడే కళ్ల ముందే చనిపోవడంతో  ఆ తల్లి తల్లడిల్లింది.  కుమారుడికి మగ సంతానం లేకపోవడంతో తలకొరవి పెట్టే వారు లేకపోయారు.

ఉన్న ఇద్దరు ఆడపిల్లలు వివాహం చేసుకుని మెట్టినింట్లో ఉన్నారు. ఇక అంత్యక్రియలు చేసేవారు లేక అందరు మధనపడుతున్న సమయంలో మృతుడి తల్లి ముందుకు వచ్చింది. మంగళవారం తానే తలకొరివి పెట్టి.. కుమారుడి అంత్యక్రియాలు నిర్వహించింది. పాడె ముందుండి  రుద్రభూమి వరకు నడిచి అంత్యక్రియలను పూర్తి చేసింది.  వృద్ధాప్యంలో అండగా ఉంటాడని భావించిన కుమారుడు అనారోగ్యంతో చనిపోవడంతో  78 ఏళ్ల ఆ కన్నతల్లి  పేగు  అల్లాడిపోయింది. కుమారుడి అంత్యక్రియాల్లో  ఆమెను ఓదార్చేందుకు బంధువులు, స్థానికులు శ్రమించాల్సి వచ్చింది.

ఇదీ చదవండి: ఒక్కగానొక్క కూతురు.. స్నానం చేసేందుకు బాత్రూమ్ కు వెళ్లి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి