iDreamPost

శిథిలాల కింద ఇరుక్కుని…11 గంటలు పాటు నరకం..చివరకు!

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను తొలగిస్తున్నారు. అలానే పురాతన గోడను కూల్చివేస్తుండగా ఓ కార్మికుడు శిథిలాల కింద ఇరుక్కుని 11 గంటలు నరకయాతన పడ్డాడు. చివరకు అతడికి ఏమైందంటే..

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను తొలగిస్తున్నారు. అలానే పురాతన గోడను కూల్చివేస్తుండగా ఓ కార్మికుడు శిథిలాల కింద ఇరుక్కుని 11 గంటలు నరకయాతన పడ్డాడు. చివరకు అతడికి ఏమైందంటే..

శిథిలాల కింద ఇరుక్కుని…11 గంటలు పాటు నరకం..చివరకు!

నిత్యం ఎన్నో రకలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా కొందరు వివిధ పనుల నిమిత్తం వెళ్లి పొరపాటును కొండ గుహల్లో,  ఇతర శిథిలాల కింద ఇర్కుకు పోతుంటారు. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు చనిపోగా మరికొందరు ప్రాణాలతో బయటపడతారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓ ప్రాంతంలో అలానే ఓ వ్యక్తి శిథిలాల కింద ఇరుక్కుని 11 గంటల పాటు నరకం అనుభవించాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ మనిషి బతికి వస్తాడని భావించిన వాళ్లకు చివరకు ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను తొలగిస్తున్నారు. అలానే పురాతన గోడను కూల్చివేస్తుండగా ఓ కార్మికుడు శిథిలాల కింద ఇరుక్కుని 11 గంటలు నరకయాతన పడ్డాడు. ఈ సంఘటన జీడిమెట్ల ప్రాంతంలోని శ్రీనిలయ ఎంక్లేవ్‌ సాయిరాం బృందావన్‌ అపార్ట్‌మెంట్‌లో సోమవారం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ జిల్లా పూర్వి మండలం కాకులబోడ తండాకు చెందిన బానోత్‌ రెడ్డి(35) జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరంకి వచ్చాడు.

నగరంలోని కుత్బుల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పద్మానగర్‌ ఫేస్‌-2 రింగ్‌రోడ్‌ సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. రోజూవారి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇది ఇలా ఉంటే గత పదమూడేళ్ల క్రితం జీడిమెట్ల ప్రాంతంలోని శ్రీనిలయ ఎన్ క్లేవ్ లోని సాయిరాం బృందావన్ అపార్ట్ మెంట్ నిర్మించారు. ఆభవనం గోడకు పగుళ్లు రావడంతో దాన్ని తీసేసి..రిటైనింగ్ గోడను రాడ్లతో నిర్మించాలని ఆ అపార్ట్మెంట్ సభ్యులు భావించారు. ఇందులో భాగంగా లేబర్ అడ్డాపై పని చేసే బానోత్‌రెడ్డి, గణేశ్‌, ఎల్లయ్య, కుమార్‌, రాజుకు తెలిపారు. ఈ పనులు చేసేందుకు వారిని  తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే సోమవారం డ్రిల్లింగ్ మిషన్ తో తవ్వకాలు చేపట్టారు. ఇదే సమయంలో దానికి ఆనుకుని ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పునాదిలో ఉన్న బానోత్ రెడ్డిపై శిథిలాలు పడ్డాయి. దీంతో అతడు అందులోనే  ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న డీఆర్‌ఎఫ్‌, మున్సిపల్‌, పోలీస్‌ యంత్రాంగం, ఆరోగ్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ శిథిలాల కింద ఇరుక్కుపోయిన బానోత్‌రెడ్డిని ప్రాణాపాయం జరగకుండా తీశారు. అయితే ఈ 11 గంటల పాటు బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు జరగ్గకుండా ఉండాలంటే నివారణ చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి