iDreamPost

పెళ్లై పది రోజులు కూడా కాలేదు..! అంతలోనే దారుణం..

అమ్మాయిల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ విధంగానే ఎంతో ఘనంగా తమ బిడ్డలకు వివాహం జరిపిస్తారు. కొందరు అమ్మాయిలు మాత్రం వారి పేరెంట్స్ కి విషాదం మిగిల్చే నిర్ణయాలు తీసుకుంటారు.

అమ్మాయిల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ విధంగానే ఎంతో ఘనంగా తమ బిడ్డలకు వివాహం జరిపిస్తారు. కొందరు అమ్మాయిలు మాత్రం వారి పేరెంట్స్ కి విషాదం మిగిల్చే నిర్ణయాలు తీసుకుంటారు.

పెళ్లై పది రోజులు కూడా కాలేదు..! అంతలోనే దారుణం..

మానవ జన్మ అనేది చాలా అరుదుగా  లభించేంది.  అందుకే ఎంతో గొప్పగా ఈ జన్మను అనుభవించాలి. ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చిన కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ జీవిత ప్రయాణం సాగించాలి. అయితే నేటికాలంలో మాత్రం చాలా మందిలో సహనం అనేది కొరవడింది. ప్రతి సమస్యకు చావే పరిష్కారంగా భావించే వారి సంఖ్య బాగాపెరిగింది. ఇంకా దారుణం ఏమిటంటే పెళ్లి  చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన నవ వధువుల్లో కొందరు కాళ్లపారాణి ఆరక ముందే దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ నవ వధువు  పెళ్లై పది రోజులు కూడా కాలేదు.. అంతలోనే కుటుంబ సభ్యులకు గుండెలు పగిలేలా చేసింది. మరి.. ఆ నవ వధువు చేసిన పని ఏమిటి?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన సుబ్బన్న, లక్ష్మీదేవి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానంగా ఉన్నారు. వీరి కుటుంబం వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ.. పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఇక సుబ్బన్న..తన ఇద్దరి కుమార్తెలను బాగా చదివించారు. ఇక ఇటీవలే పెద్ద కుమార్తె గాయత్రి(20) ఘనంగా వివాహం జరిపించారు.

ఈనెల 11వ తేదీన పెద్దవడుగూరు మండలం కండ్లగూడురు గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడికి ఇచ్చి గాయత్రికి వివాహం జరిపించారు. ఇక తమ కుమార్తెకు పెళ్లి చేసిన సంతోషంలో సుబ్బన్న దంపతులు ఉన్నారు. అయితే వారి ఆనందం పట్టుమని పది రోజులు కూడా లేదు. పెళ్లయి పది రోజులు కూడా గడవలేదు.. కాళ్ల పారాణి ఆరక ముందే  గాయత్రి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ ఇంట విషాదం నెలకొంది. ఇటీవలే పుట్టింటికి వచ్చిన గాయత్రి శుక్రవారం సాయంత్రం ఇంట్లో విషగుళికలు మింగింది. గాయత్రిని కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి గాయత్రి మృతి చెందింది.

కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలా వివిధ కారణాలతో నవ వధువులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటడం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. సమస్య ఏదైనప్పటికి భాగస్వామితో చెప్పుకుని పరిష్కార మార్గాలను అన్వేషించాలి. కానీ నేటి తరం యువత పరిష్కారం మార్గం ఆలోచన చేయకుండా చావే సమాధానంగా భావిస్తున్నారు. ఇలాంటి ఆత్మహత్య ఘటనల నిర్మూలను ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి