iDreamPost

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో బంగారం కొనుగోలు రోజు రోజుకీ పెరిగిపోతుంది. దీంతో మార్కెట్ బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. కొంతకాలంగా పసిడి ధరల్లో తరుచూ మార్పులు వస్తున్నాయి.

దేశంలో బంగారం కొనుగోలు రోజు రోజుకీ పెరిగిపోతుంది. దీంతో మార్కెట్ బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. కొంతకాలంగా పసిడి ధరల్లో తరుచూ మార్పులు వస్తున్నాయి.

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

గత కొంత కాలంగా ప్రతిరోజూ బంగారం ధరలో తరుచూ హెచ్చుతగ్గులు అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కి పసిడి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో మార్కెట్ లో దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. ఇటీవల మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది ఒక ఇన్వెస్ట్ మెంట్ గా పనికి వస్తుందని.. భవిష్యత్ లో తమకు ఏ రూపంలో అయినా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెల్ లో వస్తున్న మార్పుల వల్ల పసిడి ధరల్లో మార్పులు వస్తున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మార్కెట్ లో నిన్న మొన్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగినా.. ఈ రోజు మళ్లీ చుక్కులు చూపిస్తున్నాయి. గురువారం మార్కెట్ లో పసిడి ధరలో భారీగానే మార్పులు వచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగి 63 వేలకు చేరుకుంది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ల పసిడి ధర రూ.350 పెరిగి, రూ.57,750 కి చేరింది. దీంతో పాటు వెండి ధర రూ.700 వరకు పెరిగి, రూ.80,200 లకు చేరింది. గడిచిన కొన్ని రోజుల వ్యవధిలో పది గ్రాములకు బంగారం ధర రూ.1000 కి మించి పెరిగింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,000 వద్ద కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర రూ. 80,200 వద్ద కొనసాగుతోంది.

gold rates increased

దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,900 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63,150 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,350 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63,650 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు, కేరళా, ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,750 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63,000 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76, 200 వద్ద కొనసాగుతుంది. ముంబాయి, కోల్‌కొతా, పూనే, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,500 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి