గత రెండు, మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూ పోయాయి. కానీ నేడు మాత్రం పసిడి ప్రియులకు ఊరట కలిగించే వార్త చెప్పాయి. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..
Dharani
బంగారం అంటే భారతీయులకు ఎంతో ప్రీతి. పండగలు, శుభకార్యలు వంటి సందర్భాల్లో కచ్చితంగా ఎంతో కొంత పసిడి కొనుగోలు చేస్తారు. అయితే గత కొంత కాలంగా గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉండటం లేదు. కొన్ని రోజుల పాటు తగ్గితే.. మరికొన్ని రోజుల పాటు దిగి వస్తున్నాయి. ఇక తాజాగా పండగ సందర్భంగా బంగారం ధర దిగి రాగా.. దీపావళి తర్వాత.. వరుసగా పెరుగుతూ పోతూ ఉంది. క్రితం సెషన్‌లో గోల్డ, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా కూడా పుత్తడి ధర పెరుగుతుండటంతో.. ఆ ప్రభావం మన దగ్గర కూడా ఉంది. ఇక బంగారం కొనాలనుకునేవారికి నేడు మాత్రం కాస్త ఊరట కలిగే అవకాశం ఉంది. ఆదివారం నాడు బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర మాత్రం దిగి వచ్చింది. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి అంటే..
క్రితం సెషన్‌లో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరగ్గా.. నేడు మాత్రం స్థిరంగా ఉంది. ఇక ఆదివారం నాడు భాగ్యనగరం మార్కెట్‌లో ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. అనగా క్రితం సెషన్‌లో ఉన్న ధరనే ఈరోజు కూడా కొనసాగింది. దాంతో 22 క్యారెట్ పసిడి పది గ్రాముల ధర రూ. 56,550 వద్ద కొనసాగుతోంది.
అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర కూడా స్థిరంగానే ఉంది. ఇక నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల రేటు రూ. 61,690 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రితం సెషన్‌లో బంగాంర ధర 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల మీద 600, 24 క్యారెట్ గోల్డ్ 650 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే.
ఇక ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్ పుత్తడి పది గ్రాముల ధర రూ.56,700 మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం ధర 10 గ్రాముల రేటు మాత్రం రూ.50 మేర దిగివచ్చి.. ప్రస్తుతం రూ.61,790 వద్ద అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధర తక్కువగాను, సిల్వర్ రేటు ఎక్కువగాను ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులే దీనికి కారణం.
నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి రేటు మాత్రం దిగి వచ్చింది. గత రెండు రోజులుగా వెండి ధర కిలో మీద భారీగా పెరగ్గా.. నేడు మాత్రం తగ్గింది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర కిలో మీద 500 రూపాయలు దిగి వచ్చింది. ఇక ఆదివారం నాడు భాగ్యనగరంలో కిలో సిల్వర్ రేటు 79 వేల రూపాయలకు దిగి వచ్చింది. అలానే ఢిల్లీలో కూడా వెండి ధర కిలో మీద 500 రూపాయలు దిగి వచ్చి.. రూ.76 వేల వద్ద అమ్ముడవుతోంది.