iDreamPost

పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. నేడు ధరలు ఎంతంటే?

ఇటీవల బంగారం ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామలు పసిడిపై పడుతుంది. ఇక పెళ్లిళ్ల సీజన్ లో దేశంలో బంగారం కొనుగోలు మరీ ఎక్కువగా ఉంటుంది.

ఇటీవల బంగారం ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామలు పసిడిపై పడుతుంది. ఇక పెళ్లిళ్ల సీజన్ లో దేశంలో బంగారం కొనుగోలు మరీ ఎక్కువగా ఉంటుంది.

పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. నేడు ధరలు ఎంతంటే?

ప్రపంచంలో బంగారం విలువ రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఆడ, మగ అనే తేడా లేకండా బంగారు ఆభరణాలు కొనేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. దేశంలో కొంత కాలంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేసేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో తరుచూ మార్పులు ఏర్పడటం వల్ల ఆ ప్రభావం బంగారం పై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతూనే ఉన్నారు. బంగారం తక్కువ ధర ఉన్నప్పుడు వెంటనే కొనుగోలు చేస్తే మంచిది అని అంటున్నారు. ఇప్పటికే మార్కెట్ లో పసిడి ధర రూ.60 వేలు దాటి.. రూ.65 వైపు పరుగెడుతుంది. నేడు మార్కెట్ లో బంగారం ధరల విషయానికి వస్తే..

దేశంలో పసిడికి ఉన్న డిమాండ్ మరి దేనీకీ లేదు.. మార్కెట్ లో గీరాకీ తగ్గని ఏ వస్తువైనా ఉన్నదీ అంటే అది బంగారం ఒక్కటే అని చెప్పొచ్చు. బంగారు ఆభరణాలు ఎన్నో వెరైటీల్లో వస్తున్నాయి.. వాటిని కొనుగోలు చేసేందుకు మహిళలు తెగ ఇష్టపడుతున్నారు.. దీంతో బంగారం ధర రోజు రోజుకీ పెరిగిపోతూ వస్తుంది. బంగారం ఆభరణాలుగా మాత్రమే కాదు.. దాన్ని ఒక ఇన్వేస్ట్ మెంట్ గా కూడా కొంతమంది భావిస్తున్నారు. ఏదైనా అత్యవసర సమయం వచ్చినపుడు తమ వద్ద ఉన్న బంగారం పనికి వస్తుందని భావిస్తున్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ పట్నం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,400 ఉండగా, 24 క్యారెట్ల పసడి ధర రూ.63,710 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 300 వరకు పెరిగి ప్రస్తుతం కిలో రూ. 79,500 వద్ద కొనసాగుతుంది.

again gold rates increased

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,550 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,860 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,310 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,400 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,710 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక ముంబైలో కిలో వెండి రూ. 79,500, చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతుంది. తరుచూ పసిడి ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో స్థిరంగా ఉన్న సమయంలో కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి