iDreamPost
android-app
ios-app

పండగవేళ పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. త్వరపడకపోతే భారీ నష్టం

  • Published Nov 10, 2023 | 8:48 AM Updated Updated Nov 10, 2023 | 8:48 AM

ధన్‌తెరాస్‌ పండుగ రోజు బంగారం కొంటే కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇక నేడు ధర కూడా దిగి రావడంతో గోల్డ్‌ కొనుగోళ్లు పెరిగాయి. మరి నేడు పసిడి ధర ఎంత తగ్గిందంటే..

ధన్‌తెరాస్‌ పండుగ రోజు బంగారం కొంటే కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇక నేడు ధర కూడా దిగి రావడంతో గోల్డ్‌ కొనుగోళ్లు పెరిగాయి. మరి నేడు పసిడి ధర ఎంత తగ్గిందంటే..

  • Published Nov 10, 2023 | 8:48 AMUpdated Nov 10, 2023 | 8:48 AM
పండగవేళ పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. త్వరపడకపోతే భారీ నష్టం

పండగ వేళ లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకుంటే కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తారు. అందుకే పండుగలు, శుభకార్యాల సమయాల్లో ఎంతో కొంత పసిడి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక బంగారం మీద పెట్టుబడి పెడితే లాభమే తప్ప నష్టం ఉండదు. గత ఐదారేళ్ల వ్యవధిలో ఇది నిరూపితం అయ్యింది. అందుకే ప్రస్తుతం కాలంలో చాలా మంది బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక డిమాండ్‌ పెరిగిన కొద్ది రేటు కూడా పెరుగుతుంటుంది. ప్రస్తుతం గోల్డ్‌ రేటు గరిష్టాల వద్ద ట్రేడవుతోంది.

ఇక నేడు ధన్‌తెరాస్‌.. ఈ పండుగ రోజున బంగారం కొంటే కలసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ ధర పెరుగుతుండటంతో.. ఈ ఏడాది అమ్మకాలు అంతలా ఉండవని భావించారు. కానీ అనూహ్యంగా పండగ రోజున గోల్డ్‌ రేటు భారీగా దిగి వచ్చింది. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర ఎంత ఉంది అంటే..

పండగ రోజున పసిడి ధర దిగి వచ్చింది. నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర పది గ్రాముల మీద ఏకంగా 400 రూపాయలు తగ్గింది. దాంతో నేడు భాగ్యనగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు రూ.55,700గా ఉంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా దిగి వచ్చింది. పది గ్రాముల మీద 440 రూపాయలు తగ్గి.. ప్రస్తుతం 60,720 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

అలానే ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో సైతం కనకం రేటు తగ్గింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్‌ ధర 10 గ్రాముల మీద 400 రూపాయలు తగ్గి.. 55,850 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ బంగారం రేటు పది గ్రాముల మీద 440 రూపాయలు తగ్గి.. రూ.60,910 వద్ద ట్రేడవుతోంది.

బంగారం బాటలోనే వెండి..

నేడు వెండి ధర కూడా దిగి వచ్చింది. గత రెండు సెషన్‌లలో వెండి రేటు తగ్గగా.. శుక్రవారం నాడు కూడా దిగి వచ్చింది. ఇక నేడు హైదరాబాద్‌లో వెండి ధర కిలో మీద 300 రూపాయలు తగ్గి.. రూ. 76,200లుగా కొనసాగుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా వెండి ధర దిగి వచ్చింది. నేడు దేశ రాజధాని బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర కిలో మీద 300 రూపాయలు తగ్గి.. 73,200 రూపాయల వద్ద ట్రేడవుతోంది.