iDreamPost

వీడియో: దంపతుల మధ్య గొడవ..కోపంతో ఇల్లు తగలబెట్టిన భర్త!

Rajanna Sircilla District: ఇటీవల కాలంలో దంపతుల మధ్య చిన్న ఘర్షణలు చిలికి చిలికి గాలి వాన తుఫానులా మారినట్లు మారుతున్నాయి. తాజాగా ఓ దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ..పెద్దదిగా మారి.. ఏకంగా ఇంటినే దహించింది.

Rajanna Sircilla District: ఇటీవల కాలంలో దంపతుల మధ్య చిన్న ఘర్షణలు చిలికి చిలికి గాలి వాన తుఫానులా మారినట్లు మారుతున్నాయి. తాజాగా ఓ దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ..పెద్దదిగా మారి.. ఏకంగా ఇంటినే దహించింది.

వీడియో: దంపతుల మధ్య గొడవ..కోపంతో ఇల్లు తగలబెట్టిన భర్త!

సంసారంలో గొడవలు అనేది సర్వసాధారణం. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తల మధ్య చిన్నపాటి వాగ్వాదాలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పెద్దగానే  వాగ్వాదాలు జరుగుతుంటాయి. అయితే పూర్వం ఇలా గొడవలు పడినా కూడా దంపతులు కాసేపటికి తిరిగి కలిసిపోతుంటారు. అలా తమ సంసార సాగరంలో వచ్చే గొడవలకు సర్థుకుపోతు జీవితం సాగిస్తుంటారు. అయితే నేటి కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య సహనం అనేది లోపించింది. అందుకే ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుని గొడవ పడుతుంటారు. మరికొందరు అయితే ఏకంగా కోపంతో దారుణాలకు తెగబడుతుంటారు. తాజాగా ఓ భర్త..భార్యపై కోపంతో ఇల్లును తగలబెట్టారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివారాల్లోకి వెళ్తే..

ఇటీవల కాలంలో దంపతుల మధ్య చిన్న ఘర్షణలు చిలికి చిలికి గాలి వాన తుఫానులా మారినట్లు మారుతున్నాయి. ఇరువురు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగుతున్నారు. అహంతో ఇద్దరు చిన్న గొడవను పెద్దదిగా చేసుకుని చివరకు విషాదం మిగుల్చుతున్నారు. తాజాగా ఓ దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ..పెద్దదిగా మారి.. ఏకంగా ఇంటినే దహించింది. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త..ఏకంగా ఇంట్లో  కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో ఆ దంపతులు స్వల్పగాయాలతో బయట పడ్డారు. ఇల్లు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలోని పద్మనగర్ గ్రామంలో బాల పోచయ్య , రాజేశ్వరి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. స్థానికంగా పని చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. ఇక వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలోనే వీరికి ఆదివారం మధ్యాహ్న భోజనం విషయంలో ఘర్షణ తలెత్తింది.  ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య మాటామాటా పెరగింది. ఇక భర్త బాల పోచయ్య ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. విచక్షణను కోల్పోయిన పోచయ్య..భార్యపై కోపంతో ఇంట్లో కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఇంట్లో ఉన్న భార్య రాజేశ్వరి వెంటనే అప్రమత్తమై భయంతో బయటకు వచ్చేసింది. అయితే అప్పటికే ఇల్లు మొత్తం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇక ఇంటి నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసి పడుతుంటడటంతో స్థానికులు గమనించారు.

వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రాజేశ్వరి, పోచయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంకు చేరుకొన్న పోలీసులు దగ్దమైన ఇంటిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సంసారంలో వచ్చే వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ సర్థుకుపోవాలని పలువురు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి