iDreamPost

యువకుడ్ని హత్య చేసి..400ముక్కలు చేసిన తండ్రీకొడుకు!

ఈ మధ్యకాలంలో క్రైమ్ ఘటనలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. హత్యలు చేసేవారు అతి కిరాతకంగా చేస్తున్నారు. శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే మరో ఘటన జరిగింది. అది కూడా సంచలనం రేపుతోంది

ఈ మధ్యకాలంలో క్రైమ్ ఘటనలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. హత్యలు చేసేవారు అతి కిరాతకంగా చేస్తున్నారు. శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే మరో ఘటన జరిగింది. అది కూడా సంచలనం రేపుతోంది

యువకుడ్ని హత్య చేసి..400ముక్కలు చేసిన తండ్రీకొడుకు!

నేటి సమాజంలో మనుషుల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. రకరకాల కారణాలతో ఎంతో మంచివారిగా కనిపిస్తున్న వారు సైతం మృగాలుగా మారుతున్నారు. కొన్ని నెలల ఢిల్లీ లో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ తరువా యూపీలో కూడా ఆరాధన అనే మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. ఈ రెండు ఘటనలకు మించి మధ్యప్రదేశ్ లో  తాజాగా ఒక ఘటన చోటుచేసుకుంది. యువకుడ్ని చంపి..400 ముక్కలు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లా బహదుర్‌పుర్‌ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బహుదూర్ పూర్ ప్రాంతంలో రాజుఖాన్‌ అనే నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో  తండ్రీకుమారులు కల్లుఖాన్‌, నజీంఖాన్‌లు నివాసం ఉంటున్నారు. రాజుఖాన్ తో ఈ తండ్రీ కొడుకులకు గొడవ జరిగింది. పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. చివరకు వీరి వివాదం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి.. అక్కడ కేసు కూడా నమోదైంది.

రాజుఖాన్ …కల్లుఖాన్, నజీంఖాన్ లపై కేసు పెట్టాడు. అయితే రాజుఖాన్‌ను రాజీ చేసుకోవాలని ఆ తండ్రీ కొడుకులు కోరారు. అలా చేయాలంటే తనకు రూ.20 వేలు ఇవ్వాలని రాజుఖాన్ డిమాండ్‌ చేశాడు. రాజుఖాన్ పై పగ పెంచుకున్న కల్లుఖాన్, అతడి కుమారుడు హత్య చేయాలని పధకం రచించారు. అందులో భాగంగా రాజుఖాన్ డిమాండ్ చేసిన రూ.20 వేలు ఇస్తామని నమ్మించారు. ఆ డబ్బు ఇచ్చే విషయంతో రాజును ఇంటికి పిలిచారు. అనంతరం అతడితో ఆ తండ్రీకుమారులు వాగ్వాదం పెట్టుకున్నారు.

చివరకు రాజుఖాన్ ను అత్యంత దారుణంగా చంపేశారు. డంబెల్‌తో రాజుఖాన్ తలపై కొట్టి హత్య చేశారు.  అనంతరం మృతదేహాన్ని400 ముక్కలుగా చేశారు. ఆ శరీర భాగాలను 15 సంచుల్లో పెట్టి వివిధ ప్రాంతాల్లో పడేశారు. అనంతరం ఏమి తెలియనట్లు రోజు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో గ్వాలియర్‌లోని జనక్‌గంజ్‌ ఠాణా పరిధి మురుగుకాలువలో సెప్టెంబరు 28న యువకుడి మొండెం స్థానికులకు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరి..పరిశీలించారు. మెండెం మాత్రమే దొరకడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఈ విషయం తెలిసిన కల్లుఖాన్‌, నజీంఖాన్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిద్దరిపై పోలీసులకు ఉన్న అనుమానం మరింత బలపడింది. గాలించి తండ్రీకుమారులను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘోర ఘటనతో స్థానికంగా భయాందోళ వాతావరణం ఏర్పడింది. మరి.. ఇలాంటి క్రూర మృగాలకు ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి