iDreamPost
android-app
ios-app

గే యాప్‌లో ఛాటింగ్..గదికి రమ్మని పిలిచాడు.. చివరకు

గే యాప్‌లో ఛాటింగ్..గదికి రమ్మని పిలిచాడు.. చివరకు

ఇటీవల కాలంలో డబ్బుల కోసం అక్రమ మార్గంలో వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. పరులు కష్టపడి సంపాదించిన సొమ్మును బెదిరించి, ఇళ్లల్లోకి చొరబడి దోచుకెళ్తున్నారు.  అలానే సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని, నమ్మిన ఇంటికి వచ్చిన వారిపై దారుణలకు తెగబడుతున్నారు. తాజాగా గే యాప్ లో ఓ యువకుడిని పరిచయం చేసుకుని, స్నేహితుడిగా చాటింగ్ చేశాడు. చివరకు ఇంటికి పిలిచి.. నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడినాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నం-12 ప్రాంతానికి చెందిన ఓ యువకుడు(23) ఈ నెల 1న  ‘గే’ లకు సంబంధించిన గ్లెండర్ అనే యాప్ లో చాటింగ్ చేస్తుండగా..  అటువైపు నుంచి ఆఫ్రిది అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి కాసేపు చాటింగ్ చేసుకున్నారు.  క్షణాల్లోనే ఇద్దరు స్నేహితులుగా మారిపోయారు.  ఆ తరువాత తన గదికి రావాలంటూ ఆఫ్రిద్ కోరి.. లోకేషన్ షేర్ చేశాడు. దీంతో సదరు యువకుడు అఫ్రిది పంపిన లోకేషన్ కు వెళ్లాడు. అక్కడ పథకం ప్రకారం కత్తి సిద్ధం చేసుకున్న ఆఫ్రిద్.. యువకుడిని బెదిరించి న్యూడ్ వీడియోలు, ఫోటోలు తీశాడు.

అంతేకాక బలవంతంగా అతడి చేతికి ఉన్న బ్రాస్లెడ్ తో పాటు గొలుసు, రూ.2 వేల నగదు, డెబిట్ క్రెడిట్ కార్డులు లాక్కున్నాడు. అంతేకాక ఈ విషయం ఎవరికైన చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. చివరకు అతడి నుంచి బయట పడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఆఫ్రిదిని రౌడీషీటర్ గా గుర్తించారు. ఇతడు గతంలో కూడా ఓ యువకుడి ఇదే విధంగా బెదిరించి.. అతడి నుంచి రూ.7 వేల నగదు, బంగారు ఉంగరం దోచుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఇలాంటి నేరాల నుంచి జాగ్రత్తగా ఉండేందుకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భార్యాబిడ్డలను హత్యచేసి.. ఉరేసుకుని ఆత్మహత్య!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet