iDreamPost
android-app
ios-app

దారుణం: పెళ్లి చేసుకోమంటే.. ట్యాంకర్ కిందకు తోసి హత్య!

దారుణం: పెళ్లి చేసుకోమంటే.. ట్యాంకర్ కిందకు తోసి హత్య!

నేటికాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న నేరాలు బాగా పెరిగిపోయాయి. కొందరు మాయగాళ్లు ప్రేమ పేరుతో యువతులను లోబర్చుకుని, తీరా పెళ్లి ప్రస్తావన రాగానే ముఖం చాటేస్తున్నారు. ఈ క్రమంలో తమను పెళ్లి చేసుకోవాలని అడిగిన బాధితులను అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఇంకా దారుణం ఏమిటంటే.. ఇలాంటి ప్రేమ వ్యవహారంలో పెళ్లైన మహిళలు కూడా మోస పోతున్నారు. తాజాగా ఓ యువతి..పెళ్లి చేసుకోమంటే.. ట్యాంకర్ కిందకు తోసి హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బాచుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట్ట తండాకు చెందిన హరిజయాకు భూక్యా ప్రమీల(23) అనే కుమార్తె ఉంది. ఆమె ఇంటర్ పూర్తి చేసి..కొన్నాళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చింది. ప్రమీలకు 2022 జనవరిలో వివాహం జరగ్గా.. ఏప్రిల్ లో భర్త మరణించాడు.  ఈ క్రమంలోనే ఆమె నగరంలోని బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు యువతులతో కలిసి  ఉంటుంది. బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో ప్రమీల పని చేస్తోంది. ప్రమీల సొంతూరు సమీపంలోని తండాకు చెందిన భూక్యా తిరుపతి నాయక్(25)తో చిన్ననాటి  నుంచే పరిచయముంది.

అతడు కూడా నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో కారు డ్రైవర్ గా పని  చేస్తున్నాడు. భర్త మరణం  తరువాత వారిద్దరి మధ్య పాత స్నేహం మళ్లీ చిగురించింది. అది కాస్తా ప్రేమకు  దారి తీసింది. ఇక ప్రేమ పేరుతో ప్రమీలను ప్రమీలను తిరుపతి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలోనే  తిరుపతికి ఇటీవల మరో యువతితో నిశ్చితార్ధం జరిగింది. ఇదే విషయం ప్రమీలకు తెలిసి.. తిరుపతిని  నిలదీసింది. తిరుపతికి ఫోన్ చేసిన ప్రమీల.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. లేకుంటే తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబుతానని స్పష్టం చేసింది.

ఆదివారం ఉదయం కలవాలని ప్రమీలను కోరిన తిరుపతి.. బైక్ పై తన స్నేహితుడితో కలిసి బాచుపల్లి ప్రధాన రహదారి వద్దకు వెళ్లారు. అక్కడ వారిద్దరి మధ్య పెళ్లి విషయంపై వాగ్వాదం చేసుకున్నారు.  ఈక్రమంలో ఆవేశానికి లోనైన తిరుపతి ఆమెను అటుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్ కిందకు తోసేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.  తొలుత  ఆమె ప్రమాదవశాత్తు పడినట్లు.. తిరుపతి అందరిని నమ్మించాడు. అయితే పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు నిజం చెప్పాడు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరి..ప్రేమ పేరుతో జరుగుతున్న ఇలాంటి దారుణాల నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కానిస్టేబుల్‌ రమేష్‌ కేసులో మరో ట్విస్ట్.. శివాని అక్క చెప్పిన సంచలన నిజాలు!

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş