iDreamPost
android-app
ios-app

కానిస్టేబుల్‌ రమేష్‌ కేసులో మరో ట్విస్ట్.. శివాని అక్క చెప్పిన సంచలన నిజాలు!

కానిస్టేబుల్‌ రమేష్‌ కేసులో మరో ట్విస్ట్.. శివాని అక్క చెప్పిన సంచలన నిజాలు!

విశాఖపట్నంలో కానిస్టేబుల్‌ రమేష్‌ హత్య.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రియుడి మోజులో పడి మూడుముళ్లు వేసిన భర్తనే.. ఆ కసాయి భార్య కడతేర్చింది. ఆపై ఏం తెలియనట్లు.. తన భర్త గుండెనొప్పితో మృతి చెందాడంటూ పోలీసులను నమ్మించింది రమేష్‌ భార్య శివాని. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ప్రియుడి కోసం తన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ భర్త హత్యకు సుపారీ ఇచ్చింది శివాని. ఈ ఘటనకు సంబంధించి శివాని అక్క పైడమ్మ సంచలన నిజాలు చెప్పింది.

రమేష్ అనే వ్యక్తి విశాఖపట్నంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి భార్య శివాని, ఇద్దరు కుమార్తెలతో కలిసి నగరంలోనే నివాసం ఉంటున్నాడు. ఇక శివాని.. ఎదురింట్లో ఉండే రామారావు అనే ఆటో డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడి మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. పక్కా పథకం ప్రకారం భర్తను హత్య చేయించింది. ముందుగా అతడి చేత పూటుగా మద్యం తాగించి.. ఆ తర్వాత అతడు మత్తులోకి వెళ్లాక.. రమేష్‌ ముఖం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

తన భర్తను హత్య చేసేటప్పుడు శివాని అక్కడే ఉండటమే కాక.. తానే తన రమేష్‌ కాళ్లు కదలకుండా పట్టుకుంది. రమేష్‌ హత్యకు పాల్పడిన వారిలో శివాని, ప్రియుడు రామారావు, నీలా అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో శివాని అక్క పైడమ్మ పేరు కూడా బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పైడమ్మ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. శివాని, రమేష్ బాగానే ఉండేవారని తెలిపింది. రమేశ్ దంపతులపై  చిన్న ఆరోపణ ఉందని తెలిపింది. ఆ విషయంలో రమేశే దంపతులకు తాను అండగా ఉన్నాని పైడమ్మ తెలిపింది. అంతేకాక రామారావుతో ఎప్పటి నుంచి శివానికి పరిచయం ఉందో తనకు తెలియదన్నారు.

“ఓ సారి శివాని,  రామారావుతో కనిపించినటప్పుడు.. నేను అడగ్గా.. మాకు తెలిసినవారేనని చెప్పింది. రమేశ్ కి కూడ  రామారానవు బాగా తెలుసని శివాని తెలిపింది. నాకు ఫోన్ చేసిన ప్రతిసారి.. కాల్ ను హోల్డ్ లో పెట్టి వేరే వాళ్లతో మాట్లాడేది. రమేశ్ చనిపోయిన రోజు కూడా.. ఆయన ఇంకా నిద్రపోతున్నాడు అక్క అంటూ శివాని ఫోన్ చేసింది. రమేశ్ హత్యలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే శివానితో మాట్లాడటమే నేను చేసిన తప్పులా ఉంది. ఇప్పుడు శివాని.. నా పేరు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది” అంటూ శివాని అక్క పైడమ్మ పలు విషయాలను వెల్లడించింది.

ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టిస్తోన్న కానిస్టేబుల్‌ రమేష్‌ చివరి వీడియో.. ‘నా భార్యే నా ప్రాణం’

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet