iDreamPost
android-app
ios-app

ప్రేమించలేదని యువతిపై సైకో వీరంగం.. కత్తితో..

  • Published Mar 02, 2024 | 8:22 AM Updated Updated Mar 02, 2024 | 8:22 AM

Chandragiri Crime News: తనని ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది యువతిపై దారుణంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.. ఎక్కడంటే..

Chandragiri Crime News: తనని ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది యువతిపై దారుణంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.. ఎక్కడంటే..

ప్రేమించలేదని యువతిపై సైకో వీరంగం.. కత్తితో..

ఇటీవల మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారు కామాంధులు. చిన్నా పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్లపై రెచ్చిపోతున్నారు మృగాళ్లు. నిర్భయ, దిశ లాంటి చట్టాలను అమలు చేస్తున్నా.. ఏమాత్రం లెక్క చేయకుండా నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. ఇటీవల కొతమంది ప్రేమోన్మాదులు తమను ప్రేమించడం లేదని యువతులపై దాడులు చేయడం, హత్యలకు పాల్పపడటం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఓ యువకుడు తనని ప్రేమించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న యువతి చంద్రగిరి పట్టణంలో తన అమ్మమ్మతో ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. తిరుపతి సమీపంలోని ఓ కాలేజ్ లో నర్సింగ్ కోర్సు చదువుతుంది. ఆమె ఇంటి కింది బాగంలో ఉంటున్న మహేష్ తో పరిచయం ఏర్పడింది. ఇటీవల మహేష్ చెడు సవాసాలు పట్టడం, మద్యం సేవిస్తూ జులాయిగా తిరగడం ఆ యువతికి నచ్చలేదు. దీంతో రెండు నెలలుగా మహేష్ తో మాట్లాడటం ఆపింది. తనతో ఎందుకు మాట్లాడటం లేదని ఆ యువతిని పదే పదే ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే నెలన్నర క్రితం యువతి ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశాడు. స్థానికులు అడ్డుకొని ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసి చెన్నైలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లిపోయింది.

చంద్రగిరి ఆర్ఎఫ్ రోడ్డులో ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చేసేందుకు తన పెద్దమ్మతో చెన్నై నుంచి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ గురువారం రాత్రి యువతి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో కత్తి అక్కడే పడేసి ప్రేమోన్మాది మహేష్ అక్కడ నుంచి పరారయ్యాడు. 108 కి కాల్ చేసి యువతినిక తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రుయా ఆస్పత్రికి వెళ్లి దాడికి గల కారణాలపై ఆరా తీశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మహేష్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinTophillbetJojobet GirişcasibomCasibom GirişHoliganbetgalabetHoliganbetMarsbahis GirişCasibomJojobetHoliganbetJojobet