iDreamPost

తిరుమల మూసివేత..?

తిరుమల మూసివేత..?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలపై కరోనా ప్రభావం పడింది. దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుండడంతో కరోనా భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తిరుమకు వెళ్లే దారులు మూసివేశారు. కొండపై ఉన్న భక్తులను ఖాళీ చేయిస్తున్నారు. మరికొద్ది గంటల్లో తిరుమలను అధికారికంగా మూసివేస్తారనే ప్రచారం సాగుతోంది.

కరోనా ప్రభావంతో ఇప్పటికే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మూతపడ్డాయి. భద్రాచలం రామయ్య పెళ్లి భక్తులు లేకుండానే చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముళ్లోకాలను శాసించే శివయ్యపై కరోనా ప్రభావం పడింది. శ్రీకాళహస్తి దేవాలయాన్ని ఈ రోజు మూసివేశారు.

ఏపీలో విద్యా సంస్థలు, థియేటర్లు ఇప్పటికే మూసివేశారు. ఒంగోలులో ఈ రోజు రెండో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం వైఎస్‌ జగన్‌ అత్యవసర సమీక్ష నిర్వహించారు. మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్రమోదీ కరోనా పై జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి