iDreamPost

స్విఫ్ట్ 2024 బుకింగ్స్ ఓపెన్.. ఈసారి ఫీచర్లే కాదు సేఫ్టీ కూడా!

Swift 2024 Bookings Open- Price And Specification: మారుతీ సుజుకీ వినియోగదారులకు ఇది పెద్ద శుభవార్తే. ఎప్పటి నుంచో వినియోగదారులను ఊరిస్తున్న 2024 స్విఫ్ట్ మోడల్ కారు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

Swift 2024 Bookings Open- Price And Specification: మారుతీ సుజుకీ వినియోగదారులకు ఇది పెద్ద శుభవార్తే. ఎప్పటి నుంచో వినియోగదారులను ఊరిస్తున్న 2024 స్విఫ్ట్ మోడల్ కారు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

స్విఫ్ట్ 2024 బుకింగ్స్ ఓపెన్.. ఈసారి ఫీచర్లే కాదు సేఫ్టీ కూడా!

ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ కార్లలో కచ్చితంగా మారుతీ స్విఫ్ట్ కారు పేరు ఉంటుంది. మిడిల్ క్లాస్ వారికి బడ్జెట్ లో దొరికే కారు ఇది. అలాగే దీని మెయిన్టినెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నిజానికి కారు ఏదైనా కొనచ్చు. కానీ, ఆ తర్వాత దానిని మెయిన్ టైన్ చేయడం కాస్త కష్టంగా మారుతుంది. కానీ, స్విఫ్ట్ వంటి కార్లకు కాస్త తక్కువ ఖర్చు అవుతుంది. అయితే ఈ కారు ఇప్పుడు 2024 వర్షన్ మార్కెట్ లోకి రాబోతోంది. తాజాగా ఆ కంపెనీ స్విఫ్ట్ 2024 కారు మోడల్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసింది. కొత్త స్విఫ్ట్ కారు 2023 మోడల్ తో పోలిస్తే రెట్టంచిన మైలేజ్ తోనే కాదు.. రెట్టించిన భద్రతతో కూడా వస్తోంది. మరి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

మారుతీ సుజుకీ ఇండియా తమ నెక్ట్స్ జెనరేషన్ స్విఫ్ట్ డిజైర్ తరహాలోనే స్విఫ్ట్ కారుని కూడా చాలా అప్ గ్రేడ్ చేసింది. ప్రస్తుతం విడుదల అవుతున్న స్విఫ్ట్ కారు ఫోర్త్ జనరేషన్ ది ఈ కారు కోసం బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. వినియోగదారులు కేవలం రూ.11 వేలు టోకెన్ అమౌంట్ కట్టి.. ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్ టీరియర్, ఫీచర్స్, సేఫ్టీ మాత్రమే కాదు.. డిజైన్, లుక్స్ లో భారీ మార్పులు చేశారు. ఇంజిన్ ని కూడా మార్చేస్తున్నారు. ఇంటీరియర్ లే అవుట్ ని సరికొత్త ఫీచర్స్ తో అప్ డేట్ చేశారు. ఫ్రంట్ లో న్యూ బంపర్, సరికొత్త గ్రిల్, చంకీ బ్లాక్ సరౌండింగ్ తో అప్ డేట్ చేశారు.

Swift 2024

న్యూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ డీఆర్ఎల్స్, ఆల్ న్యూ ఫాగ్ ల్యాంప్ డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ లుక్స్ ని కూడా మార్చేశారు. వెనుక వైపు న్యూ బంపర్, రీ డిజైన్డ్ టెయిల్ గేట్ ని తీసుకొస్తున్నారు. డోర్స్ వెంట క్యారెక్టర్ లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. బలేనో నుంచి ఇన్ స్పైర్ అయ్యి ఆల్ న్యూ స్విఫ్ట్ ఇంటీరియర్ డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. సరికొత్త డ్యాష్ బోర్డ్ లేఅవుట్ తో వస్తున్నారు. 9 అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. వైర్ లెస్ ఛార్జర్, ఏసీ వెంట్స్ స్లీక్ డిజైన్ తో వస్తున్నాయి. కనెక్టెడ్ కార్ టెక్, వైర్ లెస్ యాపిల్ కార్/ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లయిమెట్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ ఉంటాయని చెప్తున్నారు.

ఈ సరికొత్త స్విఫ్ట్ లో K12 ఫోర్ సిలిడంర్ ఇంజిన్ ని 1.2 లీటర్ థ్రీ సిలిండర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో రీప్లేస్ చేస్తున్నారు. ఈ ఇంజిన్ కి సంబంధించి అధికారిక వివరాలు అందలేదు. ప్రస్తుతానికి ఆ ఇంజిన్ 85హెచ్పీ, 110ఎన్ఎం టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్ విత్ ఆటో తో వస్తుందని అంచనా వేస్తున్నారు. సేఫ్టీ పరంగా స్విఫ్ట్ 2024 కారుకు ఎన్ క్యాప్ రేటింగ్ 4 స్టార్స్ దక్కాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటున్నాయి. ఈ స్విఫ్ట్ ఎక్స్ షోరూమ్ 6.49 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి.. ఈ స్విఫ్ట్ 2024 మోడల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి