iDreamPost

రెండేళ్లు ఆగండి అందర్నీ గుర్తు పెట్టుకొంటా…జగన్

రెండేళ్లు ఆగండి అందర్నీ గుర్తు పెట్టుకొంటా…జగన్

2017 జనవరి 26 న ప్రత్యేక హోదాకు మద్దతుగా వైజాక్ లో కొవ్వొత్తుల ప్రదర్శనకు వచ్చిన జగన్ ను అప్పటి టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు జగన్ మర్చిపోయాడేమో కానీ వైసీపీ శ్రేణులు మర్చిపోయినట్లు లేదు .

ఆ రోజు హైదరాబాద్ నుండి ఫ్లయిట్ లో వచ్చిన జగన్ ను నిర్దిష్ట కారణం లేకుండా ఎయిర్పోర్ట్ లోనే ఆపేశారు ap పోలీసు అధికారులు . ఎయిర్పోర్ట్ రన్ వే పైకి కేంద్ర బలగాలు తప్ప రాష్ట్ర పోలీసులకు ప్రవేశం లేకపోయినా అక్కడికి వెళ్లి ఎయిర్పోర్ట్ నిబంధనలు మీరి జగన్మోహనరెడ్డి ని అక్కడే నిర్బంధించినంత పని చేశారు .

ఈ దూరాగతాన్ని తీవ్రంగా ఖండించిన జగన్ రన్ వే పైనే బైఠాయించి నిరసన తెలియజేయటమే కాక ఎయిర్పోర్ట్ నిబంధనలు , పోలీసు అధికారుల పరిమితి గురించి చట్టంలో ఉదహరించిన అంశాలతో జగన్ తీవ్రంగా వాదించినా పెడచెవిన పెట్టి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జగన్ ని చాలా సమయం ఎయిర్పోర్ట్ లోనే నిలిపి తిప్పి పంపారు .

ఎయిర్పోర్ట్ లోకి సివిల్ పోలీసుల ప్రవేశం పై ఎయిర్పోర్ట్ ఆధారిటీని ప్రశ్నించినా ఏ విధమైన సమాధానం లేదు . స్వతంత్ర భారత గణతంత్ర దినోత్సవం రోజున ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత హక్కుల్ని కాలరాస్తూ రాష్ట్ర పోలీసులకు సంభందం లేని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయంలో జరిగిన ఈ దురాగతం పై కేంద్రం కూడా ఏ విధమైన స్పందన వ్యక్తం చేయలేదు .

ఆ రోజు టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి . నాడు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి టీడీపీ ఎంపీ అశోకగజపతి రాజు …

ఆ రోజు జగన్ ఒక మాట అన్నాడు . కనీసం యూనిఫార్మ్ లో లేకుండా సివిల్ డ్రెస్ లో ఐడీలు కూడా లేకుండా ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన వ్యక్తులు ఒక ప్రతిపక్ష నేతని ఎలా నిర్బంధిస్తారు . అధికారం ఎల్లవేళలా ఒకరిది కాదు . రెండేళ్లు ఆగండి అందర్నీ గుర్తుపెట్టుకొంటా , ఏ ఒక్కరినీ మరిచిపోను అని ..

కాలం గిర్రున తిరిగింది మూడేళ్లు గడిచాయి . నేడు అదే ఎయిర్పోర్ట్ కి అప్పటి ఘటనకు కారకుడైన నాటి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అదే విమానాశ్రయానికి వైజాక్ వస్తున్నాడు . అందర్నీ గుర్తు పెట్టుకొంటానన్న జగన్ ఆ మాట మరిచిపోయినట్లున్నాడు .

కానీ నాటి ఘటనని వైసీపీ శ్రేణులు , సోషల్ మీడియా వాలంటీర్లు మర్చిపోయినట్లు లేదు . ఓ వైపు వైజాక్ కి రాజధాని రావటాన్ని ఇష్టపడని చంద్రబాబు మా ప్రాంతానికి రావొద్దని వైజాక్ ప్రజలు , వైసీపీ శ్రేణులు ఎయిర్పోర్ట్ వద్ద ఘోరావ్ చేస్తుండగా ,

మరో వైపు నాటి ఘటనను , టీడీపీ ఆరాచకాన్ని ప్రశ్నిస్తూ బాబుని వైజాక్ ఎయిర్పోర్ట్ నుండి తిప్పి పంపాలని సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు హోరెత్తిస్తున్నారు .

అధికారం కోల్పోయాక బాబు గారికి ఏ ప్రాంతంలోనూ ఏదీ కలిసి వస్తున్నట్టు లేదు .
గత తప్పిదాలు , అమరావతి అంశం అన్ని వర్గాల్లో , అన్ని ప్రాంతాల్లో బాబు గారికి వ్యతిరేకతనే బహుమానంగా ఇస్తున్నట్లు ఉంది . దీన్నెలా ఎదుర్కొంటారో వేచి చూడాలి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి