iDreamPost

Ayodhya: అయోధ్య గర్భగుడిలో పూజారి ముఖం కప్పుకోవడం వెనుక రహస్యం ఇదే!

  • Published Jan 24, 2024 | 1:36 PMUpdated Jan 24, 2024 | 1:36 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో అయోధ్యకు సంబంధించిన ప్రతి ఫోటో వైరల్ అవుతోంది. వాటిలో ఒకటి పూజ జరుగుతున్న సమయంలో గర్భ గుడిలో ఉన్న పూజారి తన ముఖాన్ని కనపడనివ్వకుండా.. గుడ్డతో కప్పివేసుకున్న ఫోటో కూడా ఉంది. ఆ పూజారి అలా చేయడం వెనుక చాలా పెద్ద ఆంతర్యమే దాగి ఉంది అంటున్నారు పండితులు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అయోధ్యకు సంబంధించిన ప్రతి ఫోటో వైరల్ అవుతోంది. వాటిలో ఒకటి పూజ జరుగుతున్న సమయంలో గర్భ గుడిలో ఉన్న పూజారి తన ముఖాన్ని కనపడనివ్వకుండా.. గుడ్డతో కప్పివేసుకున్న ఫోటో కూడా ఉంది. ఆ పూజారి అలా చేయడం వెనుక చాలా పెద్ద ఆంతర్యమే దాగి ఉంది అంటున్నారు పండితులు.

  • Published Jan 24, 2024 | 1:36 PMUpdated Jan 24, 2024 | 1:36 PM
Ayodhya: అయోధ్య గర్భగుడిలో పూజారి ముఖం కప్పుకోవడం వెనుక రహస్యం ఇదే!

అయోధ్యలో సంబరాల సందడి అంబరాన్ని తాకింది. అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రత్యేక్షంగా పరోక్షంగా ఈ మహత్తర ఘట్టంలో భాగం అయ్యారు. ఎప్పుడో త్రేతాయుగంలో అయోధ్యను విడిచిన రాముడు.. తిరిగి కలియుగంలో తన ఇంటికి చేరుకున్నాడు. ఇకపై కలియుగంలో కొత్త అధ్యాయం మొదలుకాబోతుందని.. యావత్ భారతదేశం విశ్వసిస్తుంది. ఈ క్రమంలో ఊరు వాడ ఏకమై భక్తి పారవశ్యంతో రామా నామ జపంలో మునిగితేలారు. ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రత్యేక్షంగా చూడలేని వారు.. వారి ఇళ్ల వద్ద నుంచి టీవీలలో ఈ ప్రత్యేక్ష ప్రసారాన్ని చూశారు. దూరాన ఉన్న వారంతా.. అయోధ్యలో కొలువుతీరిన బాల రాముడిని.. నిండైన నగలతో మొదటిసారి అంత దగ్గరగా చూడడం అదృష్టంగా భావిస్తున్న తరుణంలో.. ఆ సమయంలో గర్భ గుడిలో ఉన్న ఒక పూజారి మాత్రం అవేమి చూడకుండా తన ముఖాన్ని కప్పేసుకున్నాడు. సీసీ కెమెరాకు చిక్కిన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ప్రశ్నగా మారి.. చర్చలకు దారితీస్తున్నాయి. దీని వెనుక ఉన్న కథనాలు ఏంటో తెలుసుకుందాం.

రెండు రోజుల క్రితం అయోధ్యలో జరిగిన.. రామ మందిర ప్రాణ ప్రతిష్టాపనకు సంబంధించిన ఎన్నో చిత్రాలు సామజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ చిత్రాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. అంత సుందరంగా .. అద్భుతంగా ప్రతి ఒక్క ఫోటో అందరిని ఆకర్షిస్తోంది. ఫోటోలలో రామయ్యను చూసిన వారే ఇలా ఉంటే.. మరి ప్రత్యేక్షంగా ఆ దృశ్యాలను కళ్లారా తిలకించిన వారికి ఇంకెలా ఉంటుందో అనుకుంటున్నారు ప్రజలు. ఈ క్రమంలో రాముల వారి ఫొటోలతో పాటూ.. ప్రతిష్టాపన సమయంలో గర్భ గుడిలో ఉన్న వారిలో ఒకరైన ఉడిపికి చెందిన పెజావర్ మఠదీశా స్వామి.. విశ్వ ప్రసన్న తీర్ధ అనే పూజారి మాత్రం తన ముఖాన్ని కండువాతో కప్పి వేసుకున్నారు. ఇప్పుడు అదే అందరికి ప్రశ్నగా మారింది. కానీ, దాని వెనుక లోతైన కారణాలు, ఆచారాలు, విశ్వ ప్రసన్న తీర్ధ స్వామికి.. దేవుడితో ఉన్న అనుబంధాన్ని గురించి తెలియజేస్తాని.. దీనిని ప్రత్యేక్షంగా వీక్షించిన సహన సింగ్ అనే ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.

ఆ సమయంలో పెజావర్ మఠదీశా స్వామి అలా చేయడం వెనుక ఓ ఆచారం దాగి ఉంది. ఓడిశాలోని పూరి జగన్నాధ్ ఆలయంలో స్వామి వారికీ నైవేద్యాన్ని సమర్పించినపుడు.. ఆహరం కలుషితం కాకుండా వారి ముక్కు, నోటిని కప్పి ఉంచుతారు. ఇది అక్కడి వారు పాటించే ఆచారాలలో ఒకటి. దీనిని మధ్వ ఆచారం అని పిలుస్తారట. కేవలం మధ్వ ఆచారంలోనే కాకుండా ఇతర ఆచారాల్లోనూ.. దేవుడికి నైవేద్యం సమర్పించినపుడు.. కళ్ళు మూసుకోవడం లేదా కొద్దిసేపు గుడి తలుపులు మూసి వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. నైవేద్యం పెట్టిన తరువాత దానిని దేవుడు ఆరగిస్తాడని.. ఆ సమయంలో ఆ ఆహార పదార్ధాలపై నర దృష్టితోపాటు ఇతర ఏ ఆలోచనలు పడకుండా.. ఇలా చేస్తారని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఆచారాల ప్రకారం గానే విశ్వ ప్రసన్న స్వామి.. బాల రాముడికి నైవేద్యం నివేదించే సమయంలో ఈ ఆచారాన్ని పాటించారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి