iDreamPost

రాముడి ప్రాణప్రతిష్ఠ వీడియో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్!

ఇటీవల కాలంలో వీడియోలు చూపిస్తూ ఆపరేషన్లు చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. గతంలో సీఎం జగన్ ప్రమాణా స్వీకారం చూపిస్తూ ఓ వ్యక్తి, పోకిరి సినిమాలోని డైలాగ్స్ చూపిస్తూ మరో వ్యక్తి ఆపరేషన్లు చేశారు. తాజాగా ఇంకొక వ్యక్తి అదే విధంగా బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించారు.

ఇటీవల కాలంలో వీడియోలు చూపిస్తూ ఆపరేషన్లు చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. గతంలో సీఎం జగన్ ప్రమాణా స్వీకారం చూపిస్తూ ఓ వ్యక్తి, పోకిరి సినిమాలోని డైలాగ్స్ చూపిస్తూ మరో వ్యక్తి ఆపరేషన్లు చేశారు. తాజాగా ఇంకొక వ్యక్తి అదే విధంగా బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించారు.

రాముడి ప్రాణప్రతిష్ఠ  వీడియో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్!

అయోధ్య రామ మందిరం.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. కొన్ని కోట్ల మంది హిందువుల ఎమోషన్. ఈ మందిర నిర్మాణం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని శతాబ్ధాల నుంటి కోట్లాది మంది హిందువులు రామ మందిర నిర్మాణం కోసం వెయ్యికళ్లతో ఎదురు చూశారు. ఇటీవలే ఏళ్ల నిరీక్షణకు తెరపడుతూ కల సాకారం అయ్యింది. జనవరి 27న రాములోరి ప్రాణప్రతిష్ట జరిగింది. అయితే తాజాగా ఈ ఓ రోగి విషయంలో మరోసారి రాములోరి విషయం వచ్చింది. శ్రీరామ చంద్రుడని ప్రాణ ప్రతిష్టను వీడియో చూపిస్తూ ఓ రోగికి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. మరి.. అది ఎక్కడ, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా…

ప్రతి మనిషికి.. ఏదో ఒక విషయంపై, అంశంపై ఎన్నలేని ఇష్టం ఉంటుంది. అలాంటి ఇష్టం ఉన్న అంశాన్ని ఎన్ని సార్లు చూసిన, చదివిన వారికి తనివితీరదు. అందుకే వైద్యులు సైతం కొన్ని క్లిష్టమైన ఆపరేషన్ సమయంలో సదరు రోగి ఇష్టాలను తెలుసుకుని, ఆ వీడియోలను ప్రదర్శిస్తుంటారు. గతంలో ఓ వ్యక్తికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను చూపిస్తూ ఆపరేషన్ చేశారు. అలా శస్త్ర చికిత్స చేయడమే కాకుండా, అది విజయవంతమైంది. అలానే మరోకరికి పోకిరి సినిమాలో డైలాగ్స్ చూపిస్తూ ఆపరేషన్ చేశారు.

తాజాగా ఓ వ్యక్తికి అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన వీడియో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన మణికంఠ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.  అతను ఆటో డ్రైవర్ గా  పని చేస్తూ.. కుటుంబానికి ఆర్థిక సహకారం అందిస్తున్నాడు. మణికంఠకు కొన్నాళ్లుగా ఫిట్స్ సమస్య ఉంది. అయితే ఆపరేషన్ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని వైద్యులు తెలిపారు. కానీ, మత్తు ఇచ్చి మెదడుకు ఆపరేషన్ చేస్తే కాలు చేయి పడిపోయే ప్రమాదం ఉందని, అతన్ని నిద్ర లేదా మత్తులోకి జారుకోనివ్వకుండా జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించాలని భావించారు. ఈ క్రమంలోనే పేషంట్ వివరాలు పూర్తిగా తెలుసుకుని ఆపరేషన్ నిర్వహించారు.

గుంటూరు అరండల్ పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ అరుదైన ఆపరేషన్ జరిగింది. ఫిబ్రవరి 11న అరండల్ పేటలోని సాయి మణికంఠ అనే వ్యక్తికి మెదడు ఆపరేషన్ జరిగింది. ఈ  అయోధ్యలోని బాలారాముడి విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం పుల్ వీడియో చూపిస్తూ ఆపరేషన్ చేశారు. మణికంఠకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ, అంతేకాక తరచూ దైవభక్తి  కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు.  ఇదే విషయాన్ని తెలుసుకున్న ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి..  అయోధ్య రాముడిని వీడియో చూపిస్తూ ఆపరేషన్ ప్రయత్నించారు. ఆపరేషన్ మధ్యలోనే  ఆ వీడియో చూస్తున్న రోగి మణికంట జై శ్రీరాం అన్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పేషెంట్ బాగానే ఉన్నారని, త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటారని వైద్యులు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మరి.. ఈ అరుదైన ఆపరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి