iDreamPost

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ చేసిన ఆ ఒక్క తప్పే అరెస్టుకు కారణం అయ్యిందా?

రైతు బిడ్డ, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు అయ్యాడు. అతడిని పోలీసులు జూబ్లీహిల్స్ స్టేషన్ కు తీసుకొస్తున్నారు. అయితే ఈ ఒక్క తప్పు చేయకపోతే ప్రశాంత్ అరెస్టు అయ్యేవాడు కాదు.

రైతు బిడ్డ, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు అయ్యాడు. అతడిని పోలీసులు జూబ్లీహిల్స్ స్టేషన్ కు తీసుకొస్తున్నారు. అయితే ఈ ఒక్క తప్పు చేయకపోతే ప్రశాంత్ అరెస్టు అయ్యేవాడు కాదు.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ చేసిన ఆ ఒక్క తప్పే అరెస్టుకు కారణం అయ్యిందా?

పల్లవి ప్రశాంత్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కామన్ కప్పు కొట్టాడు అని చెప్పుకోవడం మానేసి.. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టు అయ్యాడు అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈ సీజన్ నిజంగానే ఉల్టా పుల్టాగా సాగింది. అయితే సీజన్ ముగిసిన తర్వాత కూడా అంతే ఉల్టాగా కొనసాగుతోంది. ఏ సీజన్లో కూడా ఇలాంటి దాడులు, కంటెస్టెంట్స్ కార్లను ధ్వంసం చేయడం చూడలేదు. ఏ సీజన్లో కూడా ఫ్యామిలీని బూతులు తిట్టడం, ఇంట్లో ఆడవాళ్లను లాగడం చేయలేదు. కానీ, ఈ సీజన్లో అలాంటి అన్ని దారుణాలు చూశాం. చివరకు టైటిల్ విన్నర్ అరెస్టు కూడా అయ్యాడు. అయితే పల్లవి ప్రశాంత్ అరెస్టుకు ఒకే ఒక కారణం కనిపిస్తోంది.

పల్లవి ప్రశాత్ హౌస్ లోకి వెళ్లింది మొదలు సెన్సేషన క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అక్కడున్న సెలబ్రిటీలను వెనక్కి నెడుతూ అన్ని ఆటల్లో టాప్ ప్లేస్ లో నిలిచాడు. రైతుబిడ్డ అనే ట్యాగుతో ప్రేక్షకుల వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. చివరకు టైటిల్ విన్నర్ కూడా అయ్యాడు. కానీ, ఇప్పుడు అరెస్టు అయ్యి కటకటాల వెనక్కు వెళ్తున్నాడు. అయితే ఇందులో అతడిని చాలామంది టార్గెట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కేవలం ఒకే ఒక కారణం వల్ల పల్లవి ప్రశాంత్ అరెస్టు అయ్యాడని చెప్పాలి. అదేంటంటే పోలీసుల మాట వినకపోవడం. అవును.. ఆ రోజు రాత్రి బిగ్ బాస్ యాజమాన్యం చెప్పిన మాట విన్నా.. ఆ తర్వాత పోలీసులు చెప్పిన మాట విన్నా కూడా ఇప్పుడు ప్రశాంత్ ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదు. చక్కగా ఇంటర్వ్యూలు, అభిమానులకు ఫొటోలు ఇచ్చుకుంటూ ఇంట్లో కుటుంబంతో సంతోషంగా ఉండేవాడు.

అన్నపూర్ణ స్టూడియోస్ బయట పరిస్థితి చేయి దాటేలా ఉందనే.. పోలీసులు ప్రశాంత్ బయటకు పంపొద్దని చెప్పారు. అయితే మెయిన్ డోర్ నుంచి కాకుండా ప్రశాంత్ ను బ్యాక్ డోర్ నుంచి బయటకు పంపారు. అలా పంపిన తర్వాత ప్రశాంత్ సైలెంట్ వెళ్లిపోయుంటే ఏ గోల ఉండేది కాదు. కానీ, తానేమీ దొంగని కాదని.. వెనుక గేటు నుంచి వెళ్లడానికి దొంగతనం చేయలేదని అంటూ చెప్పుకొచ్చాడు. రెండు కార్లతో తిరిగి మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూడా పోలీసులు ర్యాలీ వద్దని వారించారు. అప్పుడు ప్రశాంత్ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగాడు. ఒక రైతు బిడ్డకు మీరు ఇచ్చే విలువ ఇదేనా అంటూ ప్రశ్నించాడు. పోలీసులు చెప్పినా వినకుండా ప్రశాంత్ చెప్పాడని డ్రైవర్లు కారును ముందుకు తీసుకెళ్లారు.

ఇప్పుడు వారిని కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చి అరెస్టు చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్ ని కూడా అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకువస్తున్నారు. పల్లవి ప్రశాంత్ పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఏమున్నా గానీ మెజిస్ట్రేట్ ముందు చెప్పుకోవాలని పోలీసులు సూచించారు. ఇప్పుడు ప్రశాంత్ విజయానందం కొన్ని గంటలు కూడా లేకుండా పోయింది. అతని కుటుంబం.. అతని కోసం విలవిల్లాడుతోంది. అయితే ఆ రోజు పోలీసులు చెప్పిన మాట విని ప్రశాంత్ సైలెంట్ గా హోటల్ కో.. ఇంటికో వెళ్లిపోయుంటే ఇప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి అయితే వచ్చేది కాదు. మరి.. పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి