iDreamPost

ఈ నాయకుడు జనం మెచ్చిన రియల్ సలార్..! ఈయన ఎవరంటే?

సలార్.. ఇప్పుడు ఇండియా వైడ్ గా విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదీలు తమ నాయకుడు సలార్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జనం మెచ్చిన రియల్ సలార్ అంటున్నారు ప్రజలు.

సలార్.. ఇప్పుడు ఇండియా వైడ్ గా విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదీలు తమ నాయకుడు సలార్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జనం మెచ్చిన రియల్ సలార్ అంటున్నారు ప్రజలు.

ఈ  నాయకుడు జనం మెచ్చిన రియల్ సలార్..! ఈయన ఎవరంటే?

దేశమంతా ఇప్పుడు సలార్ మానియా నడుస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హైవోల్టేజ్ యాక్షన్స్ తో రూపుదిద్దుకున్న సలార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22న బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసేందుకు సలార్ సిద్ధమవుతోంది. కాగా సలార్ విడుదల నేపథ్యంలో హైదరాబాదీలు ఒకప్పుడు సలార్ గా పిలుచుకున్న వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన రీల్ సలార్ కాదు.. జనం మెచ్చిన రియల్ సలార్. ఒకప్పుడు భాగ్యనగరంలోని ఓల్డ్ సిటీకి చెందిన లీడర్ ఆయన. అసలు సలార్ పేరుకు ఆయనకు సంబంధం ఏంటి? ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజాస్వామ్య దేశంలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు. కానీ కొంత మంది లీడర్లు మాత్రమే జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. వారు ప్రజలకు చేసిన సేవలు, ఆ నాయకుల వ్యక్తిత్వం, పనితీరుతో జనం గుండెల్లో సజీవంగా నిలిచిపోతారు. అలాంటి నాయకులు భౌతికంగా లేకపోయిన జనం నోళ్లల్లో నానుతూనే ఉంటారు. అలాంటి నాయకుడే ఈ హైదరాబాదీ లీడర్. ఈయననే హైదరాబాదీలు సలార్ గా పిలుచుకునే వారు. ఆయన మరెవరో కాదు ఏఐఎమ్‌ఐఎమ్‌ పార్టీ లీడర్ సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ. ఈయన ఏఐఎమ్‌ఐఎమ్‌ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీ కుమారుడు.

who is real salar

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాకు సలార్ అనే టైటిల్ ఫిక్స్ చేయగానే జనాల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది. సలార్ అంటే అర్థం ఏంటని తెగ వెతికేశారు. వాస్తవానికి సలార్‌ అంటే ఉర్దూలో నాయకుడు లేదా కమాండర్‌, ఛీఫ్‌ అని అర్థం. ఈ నేపథ్యంలోనే హైదరాబాదీలు సలార్ గా పిలుచుకునే సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీని గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడంతో సలావుద్దీన్‌కు చిన్ననాటి నుంచే రాజకీయాలపై మక్కువ ఏర్పడింది.

క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక దాదాపు 4 దశాబ్ధాల రాజకీయ జీవితంలో హైదరాబాద్‌ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఆరుస్లార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తనను నమ్ముకున్న ఎంతో మంది పేద ముస్లింలకు ఆపద్భాందవుడయ్యారు సలాదుద్దీన్‌. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించి వెంటనే స్పందించి ఆదుకునే తత్వం ఉన్న నాయకుడు సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ. పేద ప్రజల గుండెల్లో నిజమైన నాయకుడుగా నిలిచారు. పేద ప్రజలకు సలావుద్దీన్‌ చేసిన సేవలకుగాను అప్పటి ప్రజలు ఆయనకు ‘సలార్‌ ఎ మిల్లత్‌’ అనే బిరుదును ఇచ్చారు. ఇక అప్పటి నుంచి సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీని సలార్ గా పిలుచుకునే వారు. సలార్‌ ఎ మిల్లత్‌ అర్థం సమాజ కమాండ్‌ అని.. అనంతరం సలార్‌ అని పిలవడం ప్రారంభించారు.

సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ కుమారులు

సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ కుమారులు ఏఐఎమ్‌ఐఎమ్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ, అక్బరుద్దీన్‌ ఓవైసీలు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు. హైదరాబాద్ లో ఏఐఎమ్‌ఐఎమ్‌ పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 7 స్థానాల్లో గెలుపొంది తమ ఉనికి చాటుకుంది. ఇక తెలంగాణ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించిన విషయం తెలిసిందే. అసదుద్దీన్‌ ఓవైసీ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక హైదరాబాద్ లో ఏఐఎమ్‌ఐఎమ్‌ పార్టీకి ఘనకీర్తిని తెచ్చిపెట్టి ప్రజల గుండెల్లో సలార్ గా నిలిచిపోయిన సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ 2008 సెప్టెంబర్‌ 29వ తేదీన తుది శ్వాస విడిచారు. మరి హైదరాబాదీలు రియల్ సలార్ గా పిలుచుకునే సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి