iDreamPost

రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో కాబోయే మంత్రులు వీరేనా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన క్యాబినెట్ లో కొలువుదీరనున్న మంత్రులు వీరేనంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ లీడర్లు ఎవరంటే?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన క్యాబినెట్ లో కొలువుదీరనున్న మంత్రులు వీరేనంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ లీడర్లు ఎవరంటే?

రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో కాబోయే మంత్రులు వీరేనా?

ఎన్నికల ఫలితాలు వెల్లడై రెండు రోజులు కావొస్తున్నా సీఎం ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. కాంగ్రెస్ పార్టీకి సైనికుడిలా పనిచేసిన రేవంత్ రెడ్డినే అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రేవంత్ రెడ్డి ముందు నుంచి చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. అలుపెరుగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణలో అధికారం దక్కేలా చేశారు. ఒక రకంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రాన్ని బహుమతిగా ఇచ్చారని చెప్పవచ్చు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టి మంత్రులు ఎవరన్న దానిపై పడింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ లో చోటు దక్కే మంత్రులు వీరేనంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మల్లు భట్టి విక్రమార్కను గానీ, మహమ్మద్ షబ్బీర్ అలీని గానీ డిప్యూటీ సీఎంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ఫుడ్ అండ్ సివిల్ సప్లై, కన్య్జూమర్ అఫైర్స్ మంత్రిగా భట్టిని.. మహమ్మద్ షబ్బీర్ అలీని సంక్షేమ శాఖ మంత్రిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ధనసరి అనసూయ అలియాస్ సీతక్కను హోం శాఖ మంత్రిగా, జైళ్ల శాఖ మంత్రిగా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డాక్టర్ జీ వివేక్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, పీ సుదర్శన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆరోగ్య శాఖ మంత్రిగా క్యాబినెట్ లో కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది.

మైనంపల్లి హన్మంతరావు పర్యావరణ శాఖ మంత్రిగా, ఎస్సీ, ఎస్టీ ఎండోమెంట్ శాఖ మంత్రిగా.. జూపల్లి కృష్ణారావు పశుసంర్ధక, మత్స్య శాఖ మంత్రిగా, నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నియమితులు కాబోతున్నట్లు తెలుస్తోంది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా, కొండా సురేఖ మహిళా, శిషు సంక్షేమ శాఖ మంత్రిగా, తుమ్మల నాగేశ్వర రావు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్, పరిశ్రమల శాఖ మంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నరేందర్ రెడ్డిని విద్య మరియు రవాణా శాఖ మంత్రిగా, అద్దంకి దయాకర్ కార్మిక శాఖ మంత్రిగా, దామోదర రాజనర్సింహ స్పీకర్ గా తెలంగాణ క్యాబినెట్ లో నూతన మంత్రులుగా కొలువుదీరనున్నట్లు సమాచారం. మరి ఈ కేబినెట్ లిస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి