iDreamPost

The Warrior -Ram రేపే ద వారియ‌ర్ రిలీజ్, టాలీవుడ్ చూపంతా రిజ‌ల్ట్ మీదే!

The Warrior -Ram రేపే ద వారియ‌ర్ రిలీజ్, టాలీవుడ్ చూపంతా రిజ‌ల్ట్ మీదే!

రేపు విడుదల కాబోతున్న రామ్ ది వారియర్ మీద వర్షాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. జనం థియేటర్లకు వెళ్లే మూడ్ లో లేకపోవడంతో బుకింగ్స్ ఈరోజు మ‌ధ్య‌హ్నాం వ‌రకు మరీ నెమ్మదిగా ఉన్నాయి. స్కూల్స్ కే సెలవులు ఇచ్చినప్పుడు అదే పనిగా సినిమా హాల్ కు వెళ్లేందుకు ఫ్యామిలీస్ సాహసించవు కదా. తెలంగాణలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోనూ పలు ప్రాంతాలు జలమయం కావడంతో జనం బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. కాని సాయంత్రం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ పుంజుకున్నాయి. సుమారు 43 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గా నిలుస్తోంది. రేపు మౌత్ టాక్ చాలా కీలకం.

ఇక తమిళనాడులో మరో కొత్త రకం టెన్షన్ మొద‌ట్లో అంటుకుంది. దర్శకుడు లింగుస్వామికి గతంలో అక్కడ ఏర్పడ్డ ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి కొన్ని చిక్కులు ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పెట్టారు. ఈ కారణంగా చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టలేదట. ఇప్పుడు అన్నీ కొలిక్కి వ‌చ్చాయి. అరవనాట సైతం సుమారు 5 కోట్ల దాకా డీల్ జరిగింది. పోటీ లేని వాతావరణంలో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న రామ్ కు ప‌రిస్థితుల‌న్నీ క్లైమాక్స్ లో అనుకూలంగా మారారు.

మొత్తానికి రేపు వారియర్ కు వ‌ర్షం మిన‌హా మ‌రో స‌మ‌స్య లేదు. నైజామ్ లో మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం ఈ సినిమాకు కలిగించే ప్రయోజనం ఎమి లేదు. పైగా వరద తీవ్రతకు జనం ఎక్కడెక్కడ ఇరుక్కుపోతున్న వీడియోలు చనిపోతున్న సంఘటనలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కలెక్షన్ల మీద కొంత‌ దెబ్బ ఉంటుంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే రెండు మూడు రోజుల తర్వాతైనా ఈజీగా పికప్ అవుతుంది. లేదూ యావరేజ్ అంటే మాత్రం చిక్కులు తప్పవు. కృతి శెట్టి గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఆది పినిశెట్టి విలనిజం ఏ మాత్రం మేజిక్ చేస్తాయో ఇంకొద్ది గంటల్లో తేలనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి